(Syed Rafi, News18,Mahabubnagar)
మట్టిలో రాళ్లుంటాయి. అందరికి తెలుసు. బియ్యం వడ్ల గింజలో ఉంటాయి ఇదీ జగమెరిగిన సత్యమే. మరి మట్టిలో ఉండాల్సిన రాళ్లు, వరి గింజల్లో ఉండాల్సిన బియ్యం ఓ చిన్నపాప కళ్లలో ఉన్నాయి. ఎవరో పెడితే కాదు..ప్రతి రోజు కళ్లలోంచి బియ్యపు గింజలు(Rice Grains),చిన్న చిన్న రాళ్లు (Stones)బయటకు వస్తున్నాయి. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగా అలా జరుగుతుందా అని సందేహం పడకండి. జోగులాంబ గద్వాల్ (Jogulamba Gadwal)జిల్లాలో 11సంవత్సరాల చిన్నారి దీపాలి(Deepali)కళ్లు చూస్తే ఈ వార్త ఎంత నిజమే అందరికి తెలుస్తుంది.
చిన్నారికి పుట్టెడు కష్టం ..
కిడ్నీలో రాళ్లు ఉండటం అనేది సర్వసాధారణ విషయం. కాని కళ్లలో రాళ్లు ఉండటం అనేది ఆశ్చర్యకరమైన విషయంగా చూడాలి. జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని నంద్యాల రంగన్న లక్ష్మి దీపాలి అనే 11ఏళ్ల బాలికను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో చిన్ననాటి నుండి దీపాలిని పెంచుకుంటున్నారు. అయితే దీపాలికి గత రెండ్రోజుల నుంచి కళ్లలోంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు వస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థిని ఆ నొప్పితో అవస్థలు పడుతున్నది.
కంట్లో రాళ్లు, బియ్యం..
దీపాలి కంటి నుంచి రాళ్లు, బియ్యం వస్తుండటం గమనించిన తల్లిదండ్రులు ఇంటి పక్కల వారిని, స్థానిక వైద్యులకు చూపించారు. అయితే ఎవరూ నమ్మలేదు. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్ళు, బియ్యం గింజలు రావడంతో తీవ్ర నొప్పితో దీపాలి బాధపడుతోంది. దీంతో హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆ బాలికలను తరలించారు.
అక్కడ కూడా వైద్యులు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి అలాంటిది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. లక్ష్మి చేసేది మీ లేక బాలికను ఇంటికి తీసుకోచ్చింది.
ఆశ్చర్యపోతున్న పేరెంట్స్..
చిన్నారి కంట్లోంటి ప్రతిరోజు సుమారు 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి వచ్చే నీరుతో పాటు అవి రావడం విచిత్రంగా ఉంది. కళ్లోంచి నీళ్లతో పాటు రాళ్లు, బియ్యపు గింజలు జారడం వీడియోను కూడా తీశారు. 11 ఏళ్ల ఈ బాలికకు కంటి నుంచి గత రెండు రోజులుగా రాళ్లు, గింజలు రావటంతో ఇదేం పరిస్థితి అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో 10-15 వస్తే అవి క్రమంగా పెరుగుతుండటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jogulamba gadwal, Telangana News, VIRAL NEWS