హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dating Apps: వివాహేతర డేటింగ్ యాప్‌లో 20 లక్షల మంది ఇండియన్ యూజర్లు.. సమాజం ఎటు పోతోంది ?

Dating Apps: వివాహేతర డేటింగ్ యాప్‌లో 20 లక్షల మంది ఇండియన్ యూజర్లు.. సమాజం ఎటు పోతోంది ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలి సంవత్సరాలలో కొందరు ఇండియన్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ (Gleeden) గణాంకాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలో వివాహ బంధానికి (Marriage) ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇండియాలోని అనేక సంస్కృతులు, మతాలలో పెళ్లి అనేది అత్యంత పవిత్రమైనది. అందుకే ఆయా మతాచారాల ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు మోసం చేసుకోకుండా కలకాలం ఒకటై ఉంటామని ప్రమాణాలు చేసుకుంటారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో భారతీయులలోని కొందరు ఈ పెళ్లి నాటి ప్రమాణాలను తుంగలోకి తొక్కి భార్యాభర్తలు అక్రమ సంబంధాలు (Extramarital) పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా వీరిలో పెళ్లి, ఏకపత్నీవ్రతం పట్ల సామాజిక దృక్పథాలు మారుతున్నాయని స్పష్టమవుతోంది. దీనికి నిదర్శనంగా ఫ్రాన్స్‌కు చెందిన వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్ (Gleeden) గణాంకాలు నిలుస్తున్నాయి. ఈ యాప్ తాజాగా భారతదేశంలో ఏకంగా 20 లక్షల మంది యూజర్లను సంపాదించుకుంది.

* మారుతున్న ఆలోచనలు

ఇంతకుముందు భారతదేశంలో పెళ్లికి ముందు అమ్మాయిలు, అబ్బాయిలు అసలు కలుసుకునేవారు కాదు. కానీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డాక పెళ్లికి ముందే డేటింగ్ యాప్స్ వాడేస్తూ చాలామంది అఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఎక్స్‌ట్రామ్యారిటల్ డేటింగ్ యాప్ (Extramarital Dating App) అందుబాటులోకి రాగానే అందులో కూడా చేరుతూ అడ్డదారులు తొక్కుతున్నారు.

వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఎక్కువగా టైర్ 1 నగరాలకు చెందినవారే ఆసక్తి చూపిస్తున్నారని గ్లీడెన్ తాజాగా వెల్లడించింది. ఇక మిగిలిన వారు టైర్ 2, 3 నగరాలకు చెందినవారట. గ్లీడెన్ అనేది ఆల్రెడీ పెళ్లయిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన డేటింగ్ యాప్. నిజానికి ఇలాంటి చెత్త యాప్‌ని అందరూ తిరస్కరిస్తారని అనుకుంటే.. దానికి భిన్నంగా ఇందులో ఒక్క ఇండియా నుంచి 20 లక్షల మంది యూజర్లు చేరడం నిజంగా షాకింగ్ విషయమే.

"భారతదేశంలో వివాహం, ఏకపత్నీవ్రతం/ ఏకభార్యత్వం విలువైనదిగా పరిగణించినా.. వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్‌లో వినియోగదారుల సంఖ్య 18% పెరిగింది. డిసెంబర్ 2021లో 1.7 మిలియన్ల యూజర్లు ఉంటే 2022లో వారి సంఖ్య 2 మిలియన్లకు పెరిగింది." అని తాజాగా గ్లీడెన్, ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ ఒక ప్రకటనలో తెలిపారు.

* ఆ నగరాల నుంచే ఎక్కువ

వివాహేతర సంబంధాల కోసం స్పెషల్‌గా తీసుకొచ్చిన ఫ్రెంచ్ యాప్ గ్లీడెన్‌లో ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది వినియోగదారులు చేరగా.. వారిలో 20% అంటే 20 లక్షల మంది వినియోగదారులు భారతదేశానికి చెందినవారు. ఈ 2 మిలియన్లలో వారి కొత్త సబ్‌స్క్రైబర్‌లలో 66 శాతం మంది టైర్ 1 నగరాల నుంచి, 44 శాతం మంది టైర్ 2, 3 నగరాల నుంచి ఉన్నారు.

Island for sale : అమ్మకానికి ఐలాండ్..హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ రేటు కన్నా తక్కువే!

Tiger sneeze : పులి తుమ్మడం ఎప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో!

గ్లీడెన్ యూజర్ బేస్‌లో ఎక్కువగా 30 ఏళ్లు పైబడిన పురుషులు, 26 ఏళ్లు పైబడిన మహిళలు ఉన్నారు. 60% మంది పురుషులతో పోలిస్తే 40% మంది మహిళా వినియోగదారులు ఉన్నారు. కాగా మహిళలకు సురక్షితంగా ఉండేలా యాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్‌లో భారతీయ వినియోగదారుల పెరుగుదల అనేది దేశంలో ఏకభార్యత్వం సాంప్రదాయ భావనలలో మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ యాప్‌లో జాయిన్ అయ్యే వారిలో అత్యధిక మంది అధిక సామాజిక-ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన వారే ఉండటం గమనార్హం. వీరిలో ఇంజనీర్లు, వ్యవస్థాపకులు, కన్సల్టెంట్లు, నిర్వాహకులు, వైద్యులు, అధిక సంఖ్యలో హౌజ్‌వైవ్స్‌ కూడా ఉన్నారు.

First published:

Tags: Dating App

ఉత్తమ కథలు