మీకు తెలుసా.. టీ బ్యాగులకు పిన్నులు, స్వీట్లపై సిల్వర్ కోటింగ్‌ బ్యాన్ చేశారని..

Tea Bags: టీ బ్యాగులకు పిన్నులు వాడవద్దని 2017 జూలైలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్క్యూలర్ జారీ చేసింది. 2018 జనవరి 1 తర్వాత ఉత్పత్తి అయ్యే ఏ ఒక్క టీ బ్యాగ్‌కు కూడా పిన్ను కనిపించవద్దని తయారీ కంపెనీలను ఆదేశించింది.

news18-telugu
Updated: May 16, 2019, 7:57 AM IST
మీకు తెలుసా.. టీ బ్యాగులకు పిన్నులు, స్వీట్లపై సిల్వర్ కోటింగ్‌ బ్యాన్ చేశారని..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 16, 2019, 7:57 AM IST
స్వీట్ షాపుకు వెళ్తే అక్కడ ఉన్న స్వీట్లపై సిల్వర్ కోటింగ్ కనిపించిందా? టీ బ్యాగులకు దారాన్ని కలిపి ఉంచేందుకు స్టాప్లర్ పిన్నును ఉపయోగించారా? మెడిసిన్‌లా సప్లిమెంట్ గోలీలు ఇస్తున్నారా? అయితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు ఫిర్యాదు చేయండి ఎందుకంటే వీటి వాడకాన్ని ఆ సంస్థ నిషేధించింది. ప్రజల ఆహార భద్రతలో భాగంగా ఆహార నాణ్యతలో తేడాలు ఉండకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వీటి వాడకం ఇప్పటికీ కొన్ని చోట్ల కొనసాగుతోంది. టీ బ్యాగులకు పిన్నులు వాడవద్దని 2017 జూలైలోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్క్యూలర్ జారీ చేసింది. 2018 జనవరి 1 తర్వాత ఉత్పత్తి అయ్యే ఏ ఒక్క టీ బ్యాగ్‌కు కూడా పిన్ను కనిపించవద్దని తయారీ కంపెనీలను ఆదేశించింది. స్వీట్లను డెకోరేట్ చేయడానికి చాలా స్వీట్ షాపులు స్వీట్లపై సిల్వర్ కోటింగ్‌ను చేర్చుతాయి. అయితే, ఆ పొర నికెల్, లెడ్, క్రోమియం, కాడ్మియంతో తయారైనదే.. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వాటిని బ్యాన్ చేస్తూ 2016లోనే సర్క్యూలర్ జారీ అయ్యింది.

ఇక, హెల్త్ సప్లిమెంట్ గోలీలను వాడుతున్నారా? అయితే జాగ్రత్త. అవి మెడిసిన్‌లా వాడకూడదు. దీర్ఘకాలిక జీవితంలో అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం ప్రతి సప్లిమెంట్ ప్యాకెట్‌పై ‘నాట్ ఫర్ మెడిసినల్ యూజ్’ అని ప్రింట్ అయ్యి ఉండాలి. మరోసారి అవి కొనేముందు ఇలా రాసి ఉందో లేదో చెక్ చేసుకోండి. అదీకాక, ఆహార పదార్థాల ప్యాకెట్లపై వాడే టోల్యూన్ రసాయనంపైనా నిషేధం ఉంది. దానివల్ల కాలేయం, కిడ్నీ దెబ్బతింటాయి. అందువల్ల వాటిని వాడకూడదు. కానీ, పెద్ద మొత్తంలో వాడుతున్నారు. వీటి వాడకం ఇంకా కొనసాగినట్లు కనిపిస్తే వెంటనే ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేసి సదరు కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...