కొలంబియాలో (Colombia stadium) షాకింగ్ ఘటన సంభవించింది. సెంట్రల్ కొలంబియాలోని ఎల్ ఎస్పినాల్‌లో ఉన్న స్టేడియంలో బుల్‌ఫైట్ (bull fight) ప్రారంభమైంది. ఈ క్రమంలో అక్కడ వందలాది మంది బుల్ ఫైట్ ను చూడటానికి వచ్చారు. అయితే, అక్కడ చెక్కలతో మూడంతస్తుల వరకు ప్రేక్షకులు కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. అయితే, ఒక్కసారిగా స్టేడియం కుప్పకూలింది. ఏంజరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. జనాలు బయట వైపుకు పరుగులు పెడుతున్నారు.
ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు.. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడ్డ వారిని వెంటనే ఎల్ ఎస్పినాల్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, శాన్ పెడ్రో ఫెస్టివల్లో భాగంగా బుల్‌ఫైట్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది.
I see that poor animal can hardly stand and think about the stadium collapse..serves you fkn right, cannot abide animal cruelty ????
ఆస్పత్రిలో చేరిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, శిథిలాల కింద మరింత మంది ఉండోచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్చలు వేగవంతం చేశారు. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డూక్యూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రులలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారలను సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలిని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాలో పెను విషాద ఘటన సంభవించింది.
దక్షిణ ఆఫ్రికాలోని తూర్పు లండన్‌లోని టౌన్షిప్లో తాత్కాలిక నైట్‌క్లబ్ లో (South African Nightclub Probe) 20 మంది యువత అనుమానస్పదంగా మరణించారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. కాగా, జోహన్నెస్‌బర్గ్‌కు దక్షిణంగా దాదాపు 1,000 కిమీ (620 మైళ్లు) దూరంలో హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న నగరంలోని క్లబ్ వెలుపల ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే చనిపోయిన వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. క్లబ్ బయట నిరసనలు చేపట్టారు.
ఎగ్జామ్ లు ముగిసాక.. ఆనందంతో వారంతా పార్టీలు చేసుకొవడానికి క్లబ్ కు వచ్చినట్లు సమాచారం. ఈస్ట్ లండన్‌లో ఉన్న సీనరీ పార్క్‌లోని స్థానిక చావడిలో 17 మంది (ప్రజలు) మరణించినట్లు నివేదిక వచ్చిందనిన అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ థెంబింకోసి కినానా తెలిపారు. బాధితులు 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు. అదే విధంగా వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు.
దీంతో అధికారులు ఘటన ఎలా జరిగుంటుందో అని అక్కడి సీసీ కెమారాలను పరిశీలిస్తున్నారు. తొలుత 17 మంది చనిపోయారు. తాజాగా, ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్య 20 కి చేరింది. మొత్తం ఎంత మంది ఉన్నారన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ దేశంలో.. తీవ్ర కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.