శ్రీ రెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. కాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు రాష్ట్రాలలో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది సినీ ప్రముఖలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కూడా ఆమె సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సమంత, నాగచైతన్య విడాకుల విషయమై మాట్లాడుతూ.. సమంత స్టైలిస్ట్ ఒక గే అంటూ ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సింగర్ శ్రీరామ్ గురించి లీక్ చేసిన వాట్సాప్ చాట్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. ఇది నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది. ప్రస్తుతం మళ్లీ తెరపైకి వచ్చింది. ‘‘సింగర్ శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా చాట్ చేశాడని శ్రీరెడ్డి ఆరోపించింది.
శ్రీరామ చంద్ర తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మన ఇండియన్ ఐడిల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి..ముందు నీ పేరులోనుంచి శ్రీరామ్ ను తొలగించు. ఆ పేరుతో పిలిపించుకునేందుకు నువ్వు అర్హుడివి కాదు’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.’’ ఇది పోస్టు చేసి నాలుగు సంవత్సరాలు (2017) అవుతోంది. కానీ ప్రస్తుతం మళ్లీ తెరమీదకు తెచ్చారు శ్రీరామ చంద్ర అంటే పడని వాళ్లు. ఇక ఈ వాట్సప్ చాట్ లో శ్రీరామచంద్ర.. శ్రీరెడ్డి వ్యక్తిగత ఫోటోలు అడగడంతో పాటు ఎక్కడ ఉంటున్నావ్.. ముంబైకి వస్తావా అంటూ అడగడం చాట్ లో చూడొచ్చు. ఆ మధ్య హాట్ టాపిక్ గా మారిన ఈ చాట్ ఇప్పుడు ఎవరో బిగ్ బాస్ ఇంటి సభ్యుల అభిమానుల కారణంగా మరోసారి తెర మీదికి వచ్చిపడ్డాయి.
ప్రస్తుతం శ్రీరామ చంద్ర తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చాట్లో శ్రీరామ్.. ఆమె బాడీ పార్ట్స్ గురించి పదే పదే ప్రస్తావించడం ఫోటోలు పంపాలని అడగడం కూడా కనిపించిందని అయితే శ్రీరెడ్డి కూడా తక్కువేం కాదు అన్నట్టుగా అతన్ని రెచ్చగొట్టేలా చాట్ లో మాట్లాడడం కూడా కనిపిస్తోందని అంటే చాట్ లో ఇద్దరి తప్పు ఉంది కానీ అతనిదే తప్పన్నట్టు శ్రీ రెడ్డి చెప్పుకొచ్చిందని సమాచారం. అయితే శ్రీరామచంద్ర అంటే గిట్టని కొంతమంది వ్యక్తులు అతనికి వ్యతిరేకంగా ఈ చాట్ ని ఉపయోగిస్తూ శ్రీరామ్ అసలు క్యారెక్టర్ ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇప్పుడు శ్రీ రామ్ మంచి పోటీ ఇస్తూ ఉండడంతో ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు శ్రీరెడ్డి పాత చాట్స్ ని బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాక శ్రీరామ్ అసలైన క్యారెక్టర్ ఇదే కాబట్టి అతనిని హౌస్ నుంచి బయటకు పంపేయాలి అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇతర కంటెస్టెంట్లకు సంబంధించిన అభిమానులు దీనిని ఆయుధంగా వాడుతున్నారు. దీనికి కౌంటర్ గా శ్రీరామచంద్ర అభిమానులు మాత్రం అసలు చాటింగ్ మొత్తం మొదటి నుండి చదివితే ఎవరిది తప్పో అర్ధమవుతుందని.. శ్రీరెడ్డి రెచ్చగొట్టే విధంగా శ్రీరామ్ తో మాట్లాడం వల్లే ఆ చాట్ జరిగిందని శ్రీరామ్ అభిమానులు మాత్రం సమర్దించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Sri Reddy