Home /News /trending /

SRI LANKA STARTS AN IN DEPTH AMBITIOUS RESEARCH ON KING RAVANA HIS AVIATION ACHIEVEMENTS ASKS PEOPLE TO SHARE INFORMATION NK

రావణుడిపై శ్రీలంక పరిశోధన... 5వేల ఏళ్ల కిందట ఏం జరిగింది?

రావణుడి ఆధారాలు సమర్పించండి... పత్రికల్లో యాడ్ వేసిన శ్రీలంక ప్రభుత్వం... (credit - twitter)

రావణుడి ఆధారాలు సమర్పించండి... పత్రికల్లో యాడ్ వేసిన శ్రీలంక ప్రభుత్వం... (credit - twitter)

రామాయణంలో... రావణుడు విలన్. కానీ... శ్రీలంక ప్రజలకు ఆయనే రాజు. అందువల్ల రావణుడికి సంబంధించిన రహస్యాల్ని కనిపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

    ప్రపంచమంతా కరోనా గురించి మాట్లాడుకుంటుంటే... శ్రీలంకలో మాత్రం... రావణుడిపై ఈమధ్య చర్చ ఎక్కువైంది. రామాయణంలో విలన్ అయిన రావణుడు... శ్రీలంకను పరిపాలించడంతో... సహజంగానే అక్కడి ప్రజలకు రావణుడిపై ఆసక్తి బాగా ఉంది. దానికి తోడు... రావణుడికి ఉన్న భక్తి, ఓ రాజుగా ఆయనకు ఉన్న కీర్తి ఇవన్నీ ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని అక్కడి వారికి పెంచుతున్నాయి. వైమానిక రంగంలో కొత్తగా చేరే ఎంతోమంది ఏవియేటర్స్... రావణుణ్ని తమకు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రజల్లో ఆసక్తికి తగ్గట్టుగా... శ్రీలంక ప్రభుత్వం పత్రికల్లో ఓ యాడ్ వేసింది. ఎవరి దగ్గరైనా రావణుడికి సంబంధించిన ఏవైనా పత్రాలు ఉంటే ఇవ్వాలని కోరింది. శ్రీలంక టూరిజం శాఖ, వైమానిక రంగ శాఖ కలిసి ఈ యాడ్ ఇచ్చాయి. రావణుడికి సంబంధించిన ఏవైనా పుస్తకాలు ఉంటే కూడా ఇవ్వాలని ఆ యాడ్‌లో కోరాయి.

    శ్రీలంక ప్రభుత్వం వేసిన యాడ్


    శ్రీలంక ప్రభుత్వం ప్రకారం... ప్రపంచంలో మొదటిసారి ఆకాశయానం చేసింది రావణుడే. 5వేల ఏళ్ల కిందటే ఆయన ఈ ప్రయాణం సాగించినట్లు శ్రీలంక పౌర విమానయాన శాఖ నమ్ముతోంది. ఆయన ఎలా గాల్లో ఎగరగలిగాడో తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆకాశంలో తొలిసారి పుష్పక విమానం ద్వారా ప్రయాణించింది రావణుడే అని తాము నిరూపించాలనుకుంటున్నట్లు శ్రీలంక పౌర విమానయాన శాఖ మాజీ వైస్ ఛైర్మన్ శశి దనాతుంగే న్యూస్18కి టెలిఫోన్ ద్వారా తెలిపారు.

    "రావణుడు చాలా తెలివైన వాడు. గాల్లో ఎగిరిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయనో పైలట్. ఇది పురాణం కాదు. ఇది నిజం. ఈ అంశంపై వివరణాత్మక పరిశోధన జరగాలి. వచ్చే ఏదేళ్లలో మేం దీన్ని నిరూపిస్తాం" అని శశి దనాతుంగే తెలిపారు.

    గతేడాది... పౌరవిమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఖగోళ వేత్తలు... శ్రీలంకలోని అతి పెద్ద బండారునాయకే విమానాశ్రయం ఉన్న చోట... కతునాయకే దగ్గర కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో... 5000 సంవత్సరాల కిందట... రావణుడు ఆకాశంలో విహరించాడని తేల్చారు. ఐతే... రావణుడు సీతాదేవిని కిడ్నాప్ చేశాడన్న అంశాన్ని కొట్టిపారేశారు. భారతీయులు అలా చెప్పుకుంటున్నారనీ, రావణుడు మంచి రాజు అని వారు అన్నారు.

    ఇప్పుడు రావణుడిపై శ్రీలంకలో ఆసక్తి బాగా పెరిగింది. ఈమధ్య పంపిన ఓ శాటిలైట్ పేరు కూడా రావణ అనే పెట్టారు. రావణుడు మంచి రాజు అనీ, సాహిత్య వేత్త అనీ చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది భారతీయులు కూడా ఆయన్ని మహా బ్రహ్మ అంటారు. అంటే... గొప్ప బాహ్మణుడు లేదా గొప్ప సాహితీ వేత్త అని అర్థం.

    (డీపీ సతీష్, న్యూస్18, బెంగుళూరు)
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Sri Lanka

    తదుపరి వార్తలు