శ్రీ లంకలో (Sri lanka) ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. కాగా, ఇంధన నిల్వలు పూర్తిగా అయిపోయాయని ఆ దేశం ప్రకటించింది.ఈ రోజు అర్ధరాత్రి నుండి అత్యవసరమైన సర్వీసులు మాత్రమే పనిచేస్తాయని తెలిపింది. అవసరమైన సేవల జాబితాలో ఆరోగ్యం, శాంతిభద్రతలు, ఓడరేవులు, విమానాశ్రయం, ఆహార పంపిణీ, వ్యవసాయం ఉంటాయి. జూలై 10 వరకు ఇతరాత్ర అవసరాలకు ఇంధన సరఫరా సేవలుపూర్తిగా నిలిపివేయబడ్డాయని ఆ దేశం స్పష్టం చేసింది.
ఇక పెట్రోల్ , డీజీల్ లేకపోతే.. పాఠశాలలు మూసివేయబడతాయి. ప్రైవేట్ కార్యాలయాలు పనిచేయలేవు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు ఇంటి నుండి పనిని చేసుకోవాలని కోరారు. 22 మిలియన్ల జనాభా ఉన్న ద్వీప దేశం ఇంధనం అయిపోవడం ఇదే మొదటిసారి.
శ్రీలంక (Sri lanka)లో ఆహార సంక్షోభం చుక్కలు చూపిస్తోంది. అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. ఒక కిలో పాల ప్యాకెట్ (milk powder packet) ధర ఏకంగా వేయి రూపాయలు దాటి రూ . 1,195కి చేరిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక పాలకుల అనాలోచిత నిర్ణయాలు ఇపుడు అక్కడి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వస్తువుల ధరల నియంత్రణను ప్రభుత్వం (government) ఎత్తివేయడంతో సామాన్యుడు పస్తులుండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆదేశంలో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 90 శాతం పెరిగింది. ఈ మేరకు అక్కడి colomboTimes వార్తా సంస్థ తెలిపింది.
గత శుక్రవారం రూ.1,400 ఉన్న 12.5 కేజీల వంట గ్యాస్ సిలిండర్ (cylinder) ధర.. ఇప్పుడు రూ.2,657కు చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర అమాంతం రూ.1257 పెరిగింది. ఇక, కిలో పాల ప్యాకెట్ ధర రూ.250 నుంచి రూ.1195 కు చేరింది. ఇవేకాకుండా ఇతర నిత్యావసరాల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.