SRI LANKA MINISTER PRESS CONFERENCE FROM TOP OF A COCONUT TREE SU
కొబ్బరి చెట్టు పైనుంచి మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్..
శ్రీలంక మంత్రి
సాధారణంగా మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే.. ఏసీ హాళ్లలోనూ, పెద్ద పెద్ద కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఓ మంత్రి మాత్రం ఇందుకు భిన్నంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సాధారణంగా మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే.. ఏసీ హాళ్లలోనూ, పెద్ద పెద్ద కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఓ మంత్రి మాత్రం ఇందుకు భిన్నంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ కొబ్బరి చెట్టుపై ఉండి మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ ఘటన శ్రీలంకలోని వాయువ్య ప్రావిన్స్‌లో చోటుకుంది. వివరాలు.. కొబ్బరి, పిష్‌టైల్ పామ్, రబ్బర్ ఉత్పత్తుల శాఖ మంత్రి అరుండికా ఫెర్నాండో గురువారం డాంకోటువాలోని తన కొబ్బరి ఎస్టేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా అక్కడకి చేరుకున్నాక.. ఓ కొబ్బరి చెట్టు ఎక్కిన మంత్రి అక్కడి నుంచే వారితో మాట్లాడారు. అంతేకాకుండా కొబ్బరి బొండాలు కూడా కోశాడు.
ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొబ్బరి సంబంధింత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో.. కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపారు. కొబ్బరి కాయలు కోసే వ్యక్తలకు.. ఒక్కొ చెట్టుకు 100 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. కొబ్బరికాయలు కోయడం, ఉత్పత్తికి సంబంధించి.. ఉద్యోగులు దొరకడం కష్టంగా మారిందన్నారు. అయితే ధరలు పెరిగినప్పటికీ.. కొబ్బరికాయలు దిగుమతి చేయబోమని హామీ ఇచ్చారు. కాగా, కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించిన వాస్తవాలను బలంగా రైతుల్లోకి తీసుకెళ్లడానికే ఆయన ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తోంది.
అలాగే ఈ సందర్భంగా వరాకపోలాకు చెందిన ఓ వ్యక్తి ఆవిష్కరించిన కొబ్బరిచెట్లు ఎక్కే యంత్రాన్ని కూడా మంత్రి పరీక్షించారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాకు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.