Squirrel : పాపం ఉడుత... ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు...

Squirrel : ఈ ప్రకృతిలోని కొన్ని జీవుల్లో జీన్స్ (జన్యువులు) చాలా వేగంగా స్పందిస్తాయి. పిచుకలు, ఎలుకలు, ఉడుతలు ఈ టైపే. అందుకే అవి ఎప్పుడూ వేగంగా, చురుగ్గా కనిపిస్తాయి.


Updated: February 15, 2020, 10:06 AM IST
Squirrel : పాపం ఉడుత... ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు...
Squirrel : పాపం ఉడుత... ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు... (credit - twitter - The Cute Plug)
  • Share this:
Squirrel : మనది కాని దాని కోసం మనం ఆరాడపడతామా. లేదు కదా. ఆ ఉడుత మాత్రం తనది కాని ఆహారం కోసం ఆరాటపడింది. ఆకలి వేసిందో లేక... సవాలుగా తీసుకుందోగానీ... ఆ ఆహారాన్ని మాత్రం అందుకోలేకపోయింది. పక్షుల కోసం ఆహారాన్ని ఓ ఇనుప ఊచపైన సెట్ చేసి పెట్టారు. అది చూసిన ఉడుత... ఆ ఊచ ఎక్కి ఆహారాన్ని తినాలని అనుకుంది. పెద్ద పెద్ద చెట్లనే సునాయాసంగా ఎక్కేయగల తాను... ఆ చిన్న ఊచను ఎక్కలేనా అని ఒక్కసారిగా దానిపైకి ఎగిరింది. గబగబా పైకి ఎగబాకింది. కానీ... 75 శాతం ఊచను ఎక్కాక... ఆ ఉడుతకు చుక్కలు కనిపించాయి. జారుడుబల్లలాగా స్మూత్‌గా ఉన్న ఊచను ఎక్కలేకపోయింది. కిందకు జారిపోయింది. అలా కిందకు దిగిన తర్వాత గానీ ఉడుతకు అర్థం కాలేదు... అన్నీ తనకు సాధ్యం కావని. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 12న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ దాదాపు 79 లక్షల మంది చూశారు. 4.55 లక్షల మంది లైక్ చేశారు. 1.25 లక్షల మంది రీట్వీట్ చేశారు. ఇక కామెంట్ల సునామీ కొనసాగుతోంది.


చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ ఈ వీడియోని చూస్తున్నారు. ఎందుకంటే... ఆ ఉడుత... కిందికి జారిపోతూ ఉండే సీన్ అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఫీడర్‌కి గ్రీజ్ ఉండటం వల్లే అది కిందికి జారిపోతోందనీ, లేదంటే అది ఈజీగా పైకి వెళ్లిపోయేదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.




దీన్ని చూస్తుంటే... ICE AGE సినిమా సీక్వెల్స్ గుర్తొస్తున్నాయని కొందరు నెటిజన్లు అంటున్నారు. కొంతమందైతే... రిప్లై ట్వీట్లలో ఉడుతలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను పెడుతున్నారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు