Home /News /trending /

SPRAYING SALT IN THE WOUND DOG PEES ON SAD WOMAN AND FLEES THE SCENE WATCH VIRAL VIDEO PAH

Viral Video: అయ్ పాయ్.. అమ్మాయి మీద ఆ పని కానిచ్చిన శునకం.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

బాలిక మీద చుచ్చు పోసిన శునకం

బాలిక మీద చుచ్చు పోసిన శునకం

Dog pees: ఇంటి ముందర అమ్మాయి బుద్ధిగా కూర్చుని ఏదో పనిలో మునిగిపోయింది. ఇంతలో వీధిలో కొన్ని శునకాలు వచ్చాయి. వాటిలో ఒక శునకం అమ్మాయి దగ్గరకు వచ్చింది.

సాధారణంగా, కుక్కలు, పిల్లులు (Dogs and Cats)  చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అందుకే ఎక్కువ మంది పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులను పెంచుకొవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాటిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు. అవి కూడా తమ యజమానితో అంతే విశ్వాసంగా (Animals) ఉంటాయి. కొన్ని సార్లు ఫన్నీగా ను ప్రవర్తిస్తుంటాయి. ఇప్పటికే కుక్కలు, పిల్లుల ఫన్నీ చేష్టలు, చిలిపి పనుల అనేక వీడియోలు నెట్టింట వైరల్ (Social media)  మారాయి. వీటిని చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇప్పుడు మరో కుక్క చేసిన ఫన్నీపని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.





పూర్తి వివరాలు.. ఒక అమ్మాయి తెలుపు రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంటు వేసుకుని ఇంటి ముందర కూర్చోని ఉంది. ఏదో విషయం గురించి డీప్ గా ఆలోచిస్తున్నట్టుంది. ఇంతలో ఆ వీధిలో కొన్ని శునకాలు వచ్చాయి. సాధారణంగా కుక్కలు ఆటోలు,కార్లు, గోడల మీద మూత్ర విసర్జన చేస్తుంటాయి. అయితే, ఈ శునకం మాత్రం కాస్త వింతగా ప్రవర్తించింది. అక్కడ దగ్గర్లో దానికి అనుకూలంగా ఏం కన్పించలేదో కానీ..మెల్లగా కింద కూర్చోని ఉన్న అమ్మాయి దగ్గరకు వెనక నుంచి వెళ్లింది.

యువతి కుక్కను గమనించలేదు. అది మెల్లగా వెళ్లి కాలు పైకెత్తి మూత్ర విసర్జన చేసింది. పాపం.. అమ్మాయికి ఏదో తడిగా అన్పిస్తే.. వెనుక వైపు చూసింది. ఆ తర్వాత.. షాక్ కు గురైంది. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు అమ్మాయిని కుక్క.. ఆ రకంగా బ్లేస్సింగ్స్ ఇచ్చిందంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఒక గున్న ఏనుగు తన యజమానితో ఫన్నీగా  ప్రవర్తించింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

ఒక ఎనిమల్ కీపర్ తన ఇంట్లో ఏనుగులోను (Elephant) పెంచుకుంటున్నాడు. దానికి ఒక చిన్న గున్న ఏనుగు ఉంది. అది తన యజమానితో కలసి తెగ అల్లరి చేస్తుంది. అది చేసే పనులు తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. దాని అల్లరిని భరించలేక, యజమాని దాన్ని వేరే చోట కట్టేసి తాను.. మాత్రం సెపరేట్ గా ఒక బెడ్ మీద పడుకున్నాడు. దీన్ని దూరం నుంచి గున్న ఏనుగు గమనించింది.

వెంటనే పరుగున అక్కడికి చేరుకుంది. చిన్న పిల్లలు తల్లిదండ్రులతో సరదగా అల్లరి చేసినట్లు ఏనుగు కూడా, తన కీపర్ తో బెడ్ కోసం చిలిపిగా ప్రవర్తించింది. బెడ్ పై నుంచి కీపర్ ను కిందకి తోసేసింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఆకు కుప్పల్లో కాసేపు బొర్లింది. ఆ తర్వాత.. దాని కీపర్ దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని చిన్న బెడ్ మీద పడుకోబెట్టాడు. ఈ ఫన్నీ వీడియో ను ఇండియన్  ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సామ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో షేర్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Dog, Funny video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు