సోషల్ మీడియాలో కొన్ని రకాల వైరల్ వీడియోలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఎందుకంటే వాటిలో దృశ్యం మనల్ని భయపెడుతుంది. మన బ్రెయిన్.. భయానక దృశ్యాలను బాగా గుర్తుంచుకుంటుంది. ఈ కొండచిలువ వీడియో అలాంటిదే. దీన్ని గమనిస్తే.. ఓ కొండచిలువను పట్టుకునేందుకు బతికివున్న కోడిపిల్లని ఎరగా వేశారు. ఓ గొట్టానికి అవతలి వైపున కోడి పిల్లని ఉంచారు. దాన్ని తిందామని వచ్చిన పాము గొట్టంలో దూరి.. కోడిపిల్లకు దగ్గరగా వెళ్లింది. అదే సమయంలో.. పాము గోట్టం నుంచి బయటకు వచ్చే వీలు లేకుండా ఉచ్చు ఏర్పాటు చేశారు.
పైపులోని ఉచ్చులో చిక్కుకున్న పాము.. బయటకు రాలేకపోయింది. కళ్ల ముందు కోడి కనిపిస్తున్నా.. దాన్ని ఏమీ చెయ్యలేక.. గింజుకుంది ఆ పాము. 15 సెకండ్ల ఈ వీడిని ట్విట్టర్‌లోని @OTerrifying అకౌంట్లో నవంబర్ 11, 2022న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ 51 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
Python trap using live chicken pic.twitter.com/pM5fP5J36G
— OddIy Terrifying (@OTerrifying) November 16, 2022
చిన్న పామే:
ఈ వీడియోలో ఉన్న కొండ చిలువ చాలా పెద్దదిలా కనిపిస్తోంది. నిజానికి ఇది చాలా చిన్నదే. కోడి పిల్ల సైజుతో పోల్చి చూస్తే.. అది చిన్నదేనని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే.. ఆ పైపు.. డ్రమ్ము ఆకారంలో ఉండటం వల్ల.. భారీ డ్రమ్ములో చిక్కుకున్న భారీ కొండచిలువలా దృశ్యం కనిపిస్తోంది.
Video : జెట్ ఇంజిన్ నుంచి దూసుకొచ్చిన గాలి.. ఎగిరిపోయిన మనుషులు
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అలా పామును బంధించడాన్ని తప్పు పడుతున్నారు. "అది నాకు పీడకలలా అనిపించింది" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "నేను భయపడ్డాను" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "మీ ఉచ్చు కోసం నన్ను ఎరగా వేస్తారా.. అని ఆ కోడి పిల్ల ఫైర్ అవుతుంది" అని మరో యూజర్ ఫన్నీ కామెంట్ ఇచ్చారు. "చిన్న పామే అయినా పెద్ద పాములా ఎందుకు కనిపిస్తోంది" అని మరో యూజర్ ప్రశ్నించారు. "అమ్మో ఆ పాము మనిషిని కూడా మింగేయగలదు" అని మరో యూజర్ కామెంట్ రాశారు. ఇలా చాలా మంది అది పెద్ద పాము అనుకుంటున్నారు. అక్కడ కోడి పిల్ల ఉన్నా... బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌లో అది కలిసిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, VIRAL NEWS, Viral Video