Shock: కరెన్సీ నోట్లపై స్పెల్లింగ్ మిస్టేక్... తప్పెవరిది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇటీవల ముద్రించిన 50 డాలర్ల నోట్లపై ఈ తప్పు దొర్లింది. ఈ తప్పును హైలైట్ చేస్తూ కరెన్సీ నోట్ ఫోటోను ఓ రేడియో స్టేషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశమైంది.

news18-telugu
Updated: May 10, 2019, 3:25 PM IST
Shock: కరెన్సీ నోట్లపై స్పెల్లింగ్ మిస్టేక్... తప్పెవరిది?
Shock: కరెన్సీ నోట్లపై స్పెల్లింగ్ మిస్టేక్... తప్పెవరిది? (Image: Reuters)
  • Share this:
ఆస్ట్రేలియాలో 50 డాలర్ల విలువ చేసే కరెన్సీ నోటుపై స్పెల్లింగ్ మిస్టేక్ బయటపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ముద్రించిన నోట్లు అవి. "responsibility" అని ఉండాల్సిన చోట "responsibilty" అని టైప్ చేయడంతో ఈ తప్పు దొర్లింది. ఆ పదంలో 'i' టైప్ చేయడం మర్చిపోయారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇటీవల ముద్రించిన 50 డాలర్ల నోట్లపై ఈ తప్పు దొర్లింది. ఈ తప్పును హైలైట్ చేస్తూ కరెన్సీ నోట్ ఫోటోను ఓ రేడియో స్టేషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశమైంది. 50 డాలర్ నోటు ముద్రణలో తప్పు దొర్లినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా అంగీకరించింది.

Read this: Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్




 



View this post on Instagram




 

After a hot tip from the @triplemmelb family, we’ve found the spelling mistake on the new $50 note! #BreakingNews


A post shared by Hot Breakfast (@mmmhotbreakfast) on





50 డాలర్ల ఆస్ట్రేలియన్ కరెన్సీ నోటులో ఎడిత్ కోవాన్ షోల్డర్‌పైన ఈ తప్పు కనిపిస్తుంది. ఎడిత్ కోవాన్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మొదటి మహిళా ఎంపీ. 1921 నుంచి 1924 వరకు సేవలు అందించారు. 1995 నుంచి 50 డాలర్ల నోటుపై ఆమె ఫోటోను ముద్రిస్తున్నారు. 2018 అక్టోబర్‌ నుంచి 50 డాలర్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే పరిశీలనగా చూస్తే తప్ప నోటుపై తప్పును గుర్తించడం కష్టం. తప్పు జరిగినట్టు అంగీకరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా... నోట్లను వెనక్కి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. మళ్లీ ప్రింట్ చేసేప్పుడు తప్పును సరిదిద్దుతామని చెప్పింది. మొత్తం 18 కోట్ల 40 లక్షల నోట్లు చలామణిలో ఉన్నాయని అంచనా.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్‌... ఇలా యాక్టివేట్ చేసుకోండి

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 10, 2019, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading