హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bike Accident: సినిమా సీన్ తలపించేలా బైక్ యాక్సిడెంట్

Bike Accident: సినిమా సీన్ తలపించేలా బైక్ యాక్సిడెంట్


ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోపల పడ్డ బైక్

ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోపల పడ్డ బైక్

Bike accident viral: కేరళ(Kerala)లోని ఇడుక్కి జిల్లా కట్టప్పన సమీపంలోని వెల్లయంకుడిలో శుక్రవారం జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్(Bike accident)స్థానికులను అవాక్కయ్యేలా చేసింది.

Bike accident viral: కేరళ(Kerala)లోని ఇడుక్కి జిల్లా కట్టప్పన సమీపంలోని వెల్లయంకుడిలో శుక్రవారం జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్(Bike accident)స్థానికులను అవాక్కయ్యేలా చేసింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ బైక్​ సినిమా సీన్​ను తలపించేలా గాల్లోకి ఎగిరి దారిపక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోపల పడింది. సమాచారం అందుకున్న విద్యుత్తు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పవర్​ సరఫరా నిలిపేయటం వల్ల పెను ప్రమాదం తప్పింది. సహాయక బృందాలు ద్విచక్రవాహనాన్ని ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోంచి జేసీబీ సాయంతో బయటకు తీశాయి.

ఈ ప్రమాదం నుంచి బైకర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతర బైక్‌లపై వచ్చిన స్నేహితులతో రైడర్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. కాగా, వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పి ట్రాన్స్​ఫార్మర్​ కంచెలోపలకి దూసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వగా..ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇతర బైక్‌లపై వచ్చిన స్నేహితులతో రైడర్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. బైకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ALSO READ Woman Cop Arrest : కాబోయే భర్తను అరెస్ట్ చేసి సంచలనంగా మారిన మహిళా పోలీస్ అరెస్ట్

మరోవైపు,దేశ రాజధానిలో అమానుష ఘటన జరిగింది. డ్రగ్స్​కు బానిసైన ఓ యువకుడు తరచూ డబ్బులు అడుగుతున్నాడని ఇద్దరు అన్నదమ్ములు.. అతడిని శుక్రవారం మధ్యాహ్నం దారుణంగా కొట్టి చంపారు. అంతా చూస్తుండగా 28 ఏళ్ల యువకుడి గొంతు కోసి, తల పగులగొట్టి దారుణంగా హత్య చేశారు. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టూ అందరూ ఉన్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఢిల్లీ(Delhi)లో ఆదర్శ్ నగర్‌ లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో ఆదర్శ్ నగర్‌కు చెందిన నరేంద్ర అలియాస్ బంటి(28)ఉత్తర ఢిల్లీ పరిసరాల్లో నేరస్థుడిగా పేరు పొందాడు. శుక్రవారం మరో నేరగాడైన రాహుల్‌ను డ్రగ్స్‌ కోసం డబ్బులను అతడు డిమాండ్ చేశారు. దీంతో ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ కాలి, అతడి సోదరుడు రోహిత్ కాలి కలిసి నరేంద్రపై దాడి చేశారు.బ్లేడుతో అతడి గొంతు కోశారు. రాళ్లు, రాడ్లతో తల పగులగొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bike accident, Kerala

ఉత్తమ కథలు