హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Green Chilli Chai: పచ్చిమిర్చితో అదిరిపోయే టీ.. టేస్ట్ కు ఫిదా.. కెఫే ముందు క్యూ కడుతున్న కస్టమర్లు

Green Chilli Chai: పచ్చిమిర్చితో అదిరిపోయే టీ.. టేస్ట్ కు ఫిదా.. కెఫే ముందు క్యూ కడుతున్న కస్టమర్లు

బెంగళూరులోని జేపీ నగర్‌లో ఉన్న ఈ కెఫే ఎప్పుడు చూసినా కస్టమర్లతో కిటకిటలాడుతోంది. ఇందులో ఎక్కువమంది కస్టమర్లు చిల్లీ ఛాయ్ కోసమే ఇక్కడకి వస్తున్నారు. పచ్చిమిర్చితో ప్రత్యేకంగా తయారు చేసే ఈ టీ వెరైటీ ఏంటంటే..

  మీకు ఎన్ని రకాల టీల గురించి తెలుసు? అల్లం టీ, బాదం టీ, గ్రీన్ టీ, లెమన్‌ టీ... వంటివి అందరికీ తెలిసిన ఫ్లేవర్లే. కానీ బెంగళూరుకు చెందిన చాయ్‌ఫీ కెఫేలో కొత్తగా పచ్చిమిర్చితో టీ చేసి అందిస్తున్నారు. ఈ చిల్లీ ఛాయ్‌కి ప్రజల నుంచి ఊహించని స్పందన వస్తోంది. కొత్త రుచులతో టీలను ఆస్వాదించాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా చిల్లీ ఛాయ్ తయారు చేశామని కెఫే నిర్వాహకులు చెబుతున్నారు. బెంగళూరులోని జేపీ నగర్‌లో ఉన్న ఈ కెఫే ఎప్పుడు చూసినా కస్టమర్లతో కిటకిటలాడుతోంది. ఇందులో ఎక్కువమంది కస్టమర్లు చిల్లీ ఛాయ్ కోసమే ఇక్కడకి వస్తున్నారు. పచ్చిమిర్చితో ప్రత్యేకంగా తయారు చేసే ఈ టీ స్పైసీగా, తీపిగా, వేడివేడిగా ఆకట్టుకుంటోంది. అందుకే కొత్త రుచితో ఉన్న టీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది.

  ఘాటుగా ఉండటమే ప్రత్యేకత

  ఇటీవల చిల్లీ ఛాయ్ గురించి సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి చాయ్‌ఫీ కెఫే గురించి ప్రజలకు తెలుస్తోంది. చిల్లీ ఛాయ్ ఫ్లేవర్ చాలామందిని ఆకట్టుకుంటోంది. దీంతో ఒక్కసారైనా దీని రుచి చూడాలని ప్రజలు భావిస్తున్నారు. దీని తయారీ గురించి కూడా చాలామంది ఆరా తీస్తున్నారు. టీ పౌడర్, పాలు, చక్కెరతో పాటు తాజా పచ్చి మిరపకాయల ముక్కలు కలిపి ఈ ఛాయ్‌ను తయారు చేస్తారట. ఇండియన్ టీ అనే భావన కల్పించడానికి, పర్యావరణహితంగా ఉండేందుకు దీన్ని మట్టి కప్పుల్లో అందిస్తున్నారు.

  ఇతర ఫ్లేవర్లు కూడా..

  ఈ కెఫే వివిధ రకాల టీ ఫ్లేవర్లపై ప్రయోగాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఇతర రకాల టీలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. మొరాకన్ మింట్, కాశ్మీరీ కహ్వా, ఓరియంటల్ జింజర్ టీ నుంచి దేశీ మసాలా ఛాయ్ వరకు.. వివిధ రకాల టీలను ఇక్కడ రుచిచూడవచ్చు. స్పైసీ ఫ్లేవర్లను ఇష్టపడే వారికి ఈ చిల్లీ ఛాయ్ బాగా నచ్చుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని తయారీదారులు చెబుతున్నారు.

  First published:

  Tags: Health benifits, Trending videos, VIRAL NEWS, Viral Videos

  ఉత్తమ కథలు