Viral Video : పిల్లిని పిచ్చి పుష్పం చేసిన పిచ్చుక...పక్షి తెలివితేటలకు ఫిదా అవ్వాల్సిందే..

Photo Credit : Twitter

Viral Video : జంతువులు, పక్షులు తెలివైనవి అని అప్పుడప్పుడూ నిరూపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో పిచ్చుక కూడా తన తెలివితేటల్ని ఫన్నీగా చూపించింది.

  • Share this:
    సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి ఎన్నో రకాల అందమైన వీడియోలు తరచూ అప్‌లోడ్ అవుతుంటాయి. జంతు ప్రపంచంలో జరిగే అద్భుతాల్ని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. ఇంటర్నెట్‌లో జంతువుల కంటెంట్ బాగా వైరల్ అయ్యే కంటెంట్ అని చెప్పొచ్చు. అందులో కొన్ని వీడియోలు వినోదాత్మకంగా ఉండగా, మరికొన్ని భయానకంగా ఉంటాయి. ఇటీవల, ఒక పిచ్చుక తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాంటి సాహసం చేసిందో ఈ వీడియో ద్వారా చూడవచ్చు. ప్రాణం ఎవరికైనా గొప్పదే.. అది మనుషులకైనా, జంతువులకైనా. ప్రాణం మీదికొస్తే ప్రపచంలో ఏ జీవైనా సరే చాకచక్యంగా స్పందిస్తుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియోను చూస్తే ఇది అక్షరాల నిజం అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే.. ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో తెలియదు కానీ.. ఓ పిల్లి చిన్న పిచ్చుకను పట్టుకుని వచ్చింది.

    ఆ పిచ్చుకను నేలపై పెట్టి ఇక స్వాహా చేద్దాం అని ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆ పిచ్చుక ఎంతకీ కదలకుండా చనిపోయిన దానిలా నటించడం ప్రారంభించింది. దీంతో ఆ పిట్ట చనిపోయిందని భావించిన పిల్లి కాస్త రిలాక్స్ అయ్యింది. ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఆ బుజ్జి పిట్ట తుర్రుమని పారిపోయింది. దీంతో పిట్ట తెలివిని ఊహించని పిల్లి దానిని పట్టుకోవడానికి మళ్లీ రంకలేసింది. కానీ ఈసారి మాత్రం అది పిల్లికి దొరికినట్లు లేదు.


    ఇలా తన అద్భుత తెలివితేటలతో ప్రాణాలను నిలబెట్టుకుంది పిచ్చుక. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. "ఏప్రిల్ ఫూల్" అంటూ క్యాప్షన్ జోడించాడు. దీంతో పిల్లిని పిచ్చుక భళే బురిడి కొట్టించిందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. పిచ్చుక చాకచాక్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిల్లిని పిచ్చి పుష్పం చేసిదంటూ పిచ్చుకపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: