ఫ్రిజ్ పాడైందని లోయలోకి తోసేశాడు.. దిమ్మదిరిగే శిక్ష విధించిన పోలీసులు..

Trending News: స్పెయిన్‌లో ఓ వ్యక్తి ఫ్రిజ్ పాడైందని.. దాన్ని ఓ వాహనంలో ఎక్కించుకొని ఊరి చివరికి వెళ్లి కొండ మీది నుంచి లోయలోకి తోసేశాడు. పైగా, ఓ ఫ్రెండ్‌తో వీడియో కూడా తీయించుకున్నాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 8, 2019, 5:34 PM IST
ఫ్రిజ్ పాడైందని లోయలోకి తోసేశాడు.. దిమ్మదిరిగే శిక్ష విధించిన పోలీసులు..
ఫ్రిజ్‌ను లోయలోకి తోసేస్తున్న స్పెయిన్ వ్యక్తి
  • Share this:
ఇంట్లో ఫ్రిజ్ లేదా వాషింగ్ మిషన్ పాడైతే ఏం చేస్తాం.. ఓ మూలన పడేసి, పాత సామానులు కొనే వారు వస్తే వారికి అమ్మేస్తాం. లేదా రీసైక్లింగ్‌కు ఇచ్చేస్తాం. కానీ, స్పెయిన్‌లో ఓ వ్యక్తి ఫ్రిజ్ పాడైందని.. దాన్ని ఓ వాహనంలో ఎక్కించుకొని ఊరి చివరికి వెళ్లి కొండ మీది నుంచి లోయలోకి తోసేశాడు. పైగా, ఓ ఫ్రెండ్‌తో వీడియో కూడా తీయించుకున్నాడు. ఆ ఫ్రిజ్‌ను తోసేస్తున్న తరుణంలో వారిద్దరు కలిసి ఇక రీసైకిల్ అయిపో అంటూ జోక్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యి పోలీసుల కంట పడింది. అంతే.. ఆ వీడియోను క్షుణ్నంగా పరిశీలించి, వ్యాన్ నంబరు సహాయంతో వారికి పట్టుకున్నారు. పర్యావరణాన్ని పాడు చేస్తారా? పైగా, జోకులు వేస్తారా? అని వింత శిక్ష విధించారు. చేతి దురదను తగ్గిస్తాం అంటూ వారి చేతులతోనే ఆ ఫ్రిజ్‌ను పైకి తెప్పించారు. అంతేకాదు.. రూ.35 లక్షల జరిమానా విధించారు.

ఆ పోలీసులే దీనికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, నిందితులకు దిమ్మదిరిగే శిక్ష విధించాం అనేలా ట్వీట్ చేశారు. కాగా, ఇతగాడు అంతకుముందు వాషింగ్ మిషన్‌ను కూడా అలాగే లోయలోకి తోసేశాడట. దానికి సంబంధించిన వీడియోను కూడా అలాగే పోస్ట్ చేశారట. శిక్ష పడిన విషయం తెలుసుకుని, అతడు పనిచేస్తున్న కంపెనీ జాబ్ లోంచి కూడా తీసేసిందట. ఇదిలా ఉండగా, వాళ్లిద్దరు చేసిన తుంటరి పనికి పోలీసులు బాగానే ఝలక్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading