నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... ఇక రెండు వారాలు వర్షాలే...వర్షాలు

Southwest Monsoon : ఊరించి ఊరించి చివరకు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్ని పలకరించాయి. ఎంట్రీ ఇస్తూనే భారీ వర్షాలు కురిపించాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 5:49 AM IST
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... ఇక రెండు వారాలు వర్షాలే...వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం (Image : Twitter / Reuters)
Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 5:49 AM IST
రైతన్నలకు ఇది నిజంగా శుభవార్తే. రెండు వారాలుగా వాన నీటి కోసం వాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ విత్తులు వేద్దామంటే... నీటి జాడ లేదు. లక్కీగా... ఇప్పటికైనా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై జాలి చూపించాయనుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచీ కంటిన్యూగా రెండు వారాలపాటూ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. వద్దంటే వాన అన్నట్లు పరిస్థితి ఉండబోతోంది. సో, ఇక వానాకాలం వచ్చేసినట్లే. అందుకు తగ్గ విధంగా మనం ప్రిపేర్ అయిపోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వానాకాలంలో సూక్ష్మక్రిములు చురుగ్గా ఉంటాయి. అడ్డమైన వ్యాధులూ వ్యాపిస్తుంటాయి. దోమలైతే నీటిలో గుడ్లు పెట్టి దండయాత్ర చేస్తాయి. అన్నింటినీ తట్టుకోవడానికి మనం సిద్ధం కావాలి.

తెలంగాణలో నైరుతి : వచ్చే నెల 4 వరకూ తెలంగాణలో భారీ వర్షాలు పడబోతున్నాయి. తెలంగాణ అదృష్టం బాగుంది. కాళేశ్వరం మొదలవ్వగానే... వర్షం కూడా వస్తోంది. హైదరాబాద్‌లో కూడా గట్టిగానే కురిసింది. ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తినా, భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో. 48 శాతం వర్షం లోటు ఉన్న టైంలో... పడుతున్న ఈ వానలు అత్యంత ముఖ్యమైనవి, అవసరమైనవి కూడా. అందువల్ల నైరుతి రాకను మనమంతా మనస్ఫూర్తిగా స్వాగతించాల్సిందే. ఈసారి తెలంగాణలో 97 శాతం వానలు పడతాయని అంచనా.

ఏపీలో నైరుతి : ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కంటిన్యూగా వానలు పడతాయట. ఐతే... కోస్తాంధ్రలో భారీగా, రాయలసీమలో సాధారణంగా వానలు కురుస్తాయంటున్నారు. నిజానికి ఏపీలో కూడా ఇన్నాళ్లూ రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. వానల కోసం ప్రత్యేక పూజలు కూడా చేశారు. మొత్తానికి వరుణ దేవుడు కరుణించాడనుకోవాలి. ఇప్పుడు ఖరీఫ్ పంట వేసుకునేందుకు సరైన టైమ్ వచ్చిందని వాతావరణ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం : మొన్నటిదాకా మొండికేసిన రుతుపవనాలు ఇప్పుడు జోరందుకోవడానికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే. సరైన కదలిక లేకుండా నెమ్మదించిన రుతుపవనాల్ని ఆ అల్పపీడనం ముందుకు నెట్టింది. మున్ముందు రుతుపవనాలు మరింత బలంగా తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతున్నాయి. జులై 15లోపు దేశమంతా విస్తరించబోతున్నాయి.

First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...