హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Southwest Monsoon : కేరళను తాకిన రుతుపవనాలు... తీరంలో భారీ వర్షాలు...

Southwest Monsoon : కేరళను తాకిన రుతుపవనాలు... తీరంలో భారీ వర్షాలు...

కేరళను తాకిన రుతుపవనాలు... తీరంలో భారీ వర్షాలు...

కేరళను తాకిన రుతుపవనాలు... తీరంలో భారీ వర్షాలు...

SouthWest Monsoon 2020 : కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.

SouthWest Monsoon 2020 : ఈసారి నైరుతీ రుతుపవనాలు... రెగ్యులర్‌గా రావాల్సిన సమయానికే వచ్చాయి. జూన్ 1న అవి కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ అధికారులు చెప్పగా... సరిగ్గా జూన్ 1నే అవి కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం అక్కడ తీరంలో వర్షాలు పడుతున్నాయి. కంటిన్యూగా ఐదు రోజులపాటూ కేరళ అంతటా వానలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు చాలా జోరుగా ఉన్నాయి. గాలులు బాగా వీస్తున్నాయి. దట్టమైన మేఘాల్ని వెంట తెచ్చాయి. కాబట్టి... ఈసారి మంచి వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.

మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. కేరళను నైరుతి తాకిన సమయంలో... తెలంగాణలో ముందుగానే వర్షాలు కురుస్తున్నాయి. అటు ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం ఉంది. దాంతోపాటూ... ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవుల వరకూ... తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళపై ఉపరితల ద్రోణి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. అది వాయుగుండంగా మారే ఛాన్సుంది. అందువల్ల వచ్చే మూడ్రోజులూ తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈసారి రుతుపవనాలు బలంగా ఉండటంతో... దేశవ్యాప్తంగా నాలుగు నెలలపాటూ... సాధారణ వర్షం పడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ 75 శాతం వర్షం కురుస్తుందని వివరించారు.

ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ మాత్రం... మే 30నే కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకాయని తెలిపింది. భారత వాతావరణ విభాగం మాత్రం వారం కిందట చెప్పినట్లే... జూన్ 1నే తీరాన్ని తాకినట్లు చెప్పింది. మే 30న కేరళను రుతుపవనాలు తాకే వాతావరణం లేదని తెలిపింది. ఏది ఏమైతేనేం... మొత్తానికి రుతుపవనాలు కేరళకు వచ్చేశాయి. ఇక వారం ఆగితే... మన తెలుగు రాష్ట్రాలకూ వానల పండగే అనుకోవచ్చు.

తెలంగాణ... హైదరాబాద్‌లో నిన్న క్యుములో నింబస్ మేఘాల వల్ల భారీ వర్షం కురిసింది. ఆ మేఘాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందువల్ల రాత్రంతా అక్కడక్కడా జల్లులు పడ్డాయి. తెల్లారాక కూడా అక్కడక్కడా వాన పడింది. హైదరాబాద్‌లో ఇవాళ, రేపు భారీ వర్షం పడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దనీ, ఇప్పుడున్న మేఘాలు... గర్జించే మేఘాలు కావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని మరీ మరీ చెబుతున్నారు. ఈ మేఘాల్లో ఉరుములు, మెరుపులూ కామన్‌ అనీ... ఒక్కసారిగా కుండపోత వాన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందంటున్నారు. వారం కిందట ఇలాగే ఈదురుగాలులు వచ్చి... హైదరాబాద్‌లో 150కి పైగా చెట్లు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు వాలిపోయాయి. అందువల్ల ఈదురు గాలుల్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు. వర్షం లేనప్పుడే పనులు ముగించుకొని... వర్షం ఉన్నప్పుడు ఇళ్లలోంచి బయటకు రావొద్దంటున్నారు.

First published:

Tags: Kerala, Rains, South West Monsoon, WEATHER

ఉత్తమ కథలు