Shave Head Protest: గుండు కొట్టించుకుని విద్యార్ధుల ఆందోళన..కారణమేంటంటే..

Photo Credit : Reuters

Shave Head Protest : ఈ ఆందోళనలో దాదాపు 30 మంది దక్షిణ కొరియా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 10 మందికి మించి రోడ్లపై ఎక్కడా కనిపించకూడదు. అయితే ఈ నిరసనకు మాత్రం పోలీసులు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. ఇంతకీ కారణమేంటంటే..

  • Share this:
పసిఫిక్ మహా సముద్రంలోకి ఫుకుషిమా అణు రియాక్టర్ నుంచి వచ్చే కలుషితమైన నీటిని విడుదల చేయాలనే జపాన్ నిర్ణయాన్ని నిరసిస్తూ దక్షిణ కొరియా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వినూత్న రీతిలో నిర్వహిస్తున్న ఈ ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సియోల్‌లోని జపాన్ రాయబార కార్యాలయం ముందు గుండు కొట్టించుకొని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో దాదాపు 30 మంది దక్షిణ కొరియా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 10 మందికి మించి రోడ్లపై ఎక్కడా కనిపించకూడదు. అయితే ఈ నిరసనకు మాత్రం పోలీసులు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. జపాన్ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుండు చేయించుకున్న యువ నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. అణు ప్లాంట్ నీటిని సముద్రంలోకి విడుదల చేయాలనే దాయాది దేశం ప్రణాళికను విమర్శిస్తున్నారు. "జపాన్ ప్రభుత్వం వెంటనే కలుషితమైన నీటిని విడుదల చేసే ప్రణాళికను రద్దు చేయాలి" అని రాసి ఉన్న ప్లకార్డులతో ఆందోళన చేస్తున్నారు.

అంతర్జాతీయ కోర్టులో పిటిషన్..
రానున్న రెండు సంవత్సరాల్లో ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి ఒక మిలియన్ టన్నుల శుద్ధి చేసిన నీటిని పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్ ప్రకటించింది. సియోల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశ విదేశాంగ శాఖ కూడా జపాన్ అధ్యక్షుడు మూన్ జే ఇన్, రాయబారిపై అంతర్జాతీయ కోర్టులో పిటీషన్ వేయాలని అధికారులను ఆదేశించింది.




జపాన్ నిర్ణయంపై పర్యావరణ కార్యకర్తల నుంచి కూడా నిరంతరం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చర్చిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. జపాన్ ప్రభుత్వం ఇలా విధంగా చేస్తుంటే ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయని ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జపాన్ చేస్తున్నది హేయమైన చర్య అని, ఇతర దేశాలు ఎందుకు ప్రశ్నించడం లేదని మరోకరు స్పందించారు. విషపూరిత నీటిని సముద్రంలో పంపడం సరైన ఎంపిక కాదని ఇంకొకరు కామెంట్ చేశారు. సముద్రంలోకి ఫుకుషిమా అణు రియాక్టర్ నీటిని పంపడం అంత మంచి ఆలోచన కాదని, ఆ నీరు సముద్ర జీవరాశులను ప్రభావితం చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published: