హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

రియల్ హీరోలకు కృతజ్ఞతలు.. రోడ్డు మీద పడిన 2 వేల వైన్ బాటిళ్ల ను ఏంచేశారో తెలుసా..?

రియల్ హీరోలకు కృతజ్ఞతలు.. రోడ్డు మీద పడిన 2 వేల వైన్ బాటిళ్ల ను ఏంచేశారో తెలుసా..?

రోడ్డు మీద బోల్తా పడిన వాహనం

రోడ్డు మీద బోల్తా పడిన వాహనం

South Korea: బీర్ బాటిళ్లను తీసుకెళ్తున్న డీసీఏం వాహనం అనుకోకుండా మూల మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ క్రమంలో దానిలో ఉన్న వైన్ బాటిళ్లు కింద పడ్డాయి.

రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సార్లు అనుకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహానాలు బోల్తా పడటం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటివి జరుగుతుంటాయి. మనం తరచుగా బీర్ బాటిళ్లు కింద పడటం, టమోటా లారీలు అదుపు తప్పి కింద పడటం వంటి వార్తలను చూస్తుంటాం. అలాంటి సమయంలో కొన్ని సార్లు.. జనాలు.. ఎగబడి అక్కడి సామానులను ఎత్తుకుపోతుంటారు. కనీసం లారీలో ఎవరైన ఉన్నారా లేదా అని పట్టించుకోరు. కనీసం పోలీసులకు సమాచారం ఇచ్చే పాపన పోరు. అయితే, ఇక్కడ దీనికి భిన్నంగా కొంత మంది రోడ్డు మీద ట్రక్కు నుంచి బోల్తా పడిన బీర్ బాటిళ్లను కేవలం గంటల వ్యవధిలోనే క్లీన్ చేయడంలో సహయపడ్డారు.

పూర్తి వివరాలు.. సౌత్ కొరియాలో (South korea) అనుకొని ఘటన జరిగింది. కాస్ అనే బీర్ కంపెనీ. చున్ చియోన్ లోని , మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో వాహనంలో ఉన్న దాదాపు.. 2వేలకు పైగా బీర్ బాటిళ్లు రోడ్డుమీద పడి పోయాయి. అక్కడ రోడ్డంతా గాజు ముక్కలతో నిండిపోయింది. దీంతో కొంత మంది స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

కేవలం గంటల వ్యవధిలోనే అక్కడి వ్యర్థాలను తొలగించడంలో తమ వంతు సహాయం అందించారు. గత నెల జూన్ 29 న ఈ ఘటన జరిగింది. అయితే, తాజాగా, కాస్ అనే.. కంపెనీ అప్పుడు రోడ్లను శుభ్రం చేయడంలో సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (viral video) మారింది.

ఇదిలా ఉండగా ఒక ఎమ్మెల్యేను స్థానికులు బురదతో స్నానం చేయించారు.

ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. స్థానికంగా పిప్పర్ డ్యూరా లోని మహా రాజ్ గంజ్ లోని ప్రజలు.. పంటలు చక్కగా పండటానికి, వర్షాలు బాగా కురవడానికి వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలు.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జై మంగల్ కనోజియాకు బురదతో స్నానం చేయించారు. అక్కడి ప్రజలు.. తమ నియోజక వర్గం నేత.. బురదలో స్నానంచేస్తే.. ఇంద్రుడు సంతోషిస్తాడని వారు భావిస్తారు.

అందుకే.. అక్కడి ప్రజలు తమ నియోజక వర్గానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే జై మంగల్ కనోజియాపై బురద స్నానం చేయించారు. దీన్ని అక్కడి ప్రజలు.. కాల్ కలూటీ అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం కొందరు మహిళలు ఎమ్మెల్యేకు బురదతో స్నానం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video)  మారింది.

First published:

Tags: South korea, Viral Video, Wine

ఉత్తమ కథలు