కొందరు ప్రేమలో ఉన్నప్పుడు అదేదో.. వింత లోకంలో విహరిస్తు ఉంటారు. అప్పుడు వారికి చుట్టుపక్కల ఏంజరుగుతుందో అసలు పట్టించుకోరు. ఎవరిని లెక్క చేయరు. లవర్స్ ఇద్దరు మాత్రమే.. కలిసి చట్టా పట్టాలేసుకుంటూ సినిమాలకు, షికార్లకు ఒక్కటేమిటీ ప్రతి ఒక్క చోటికి వెళ్తుంటారు. ఒకరిపై మరోకరు విచ్చల విడిగా ఖర్చులు చేసుకుంటారు. కాస్లీ గిప్ట్ లు కూడా ఇచ్చుకుంటారు. అయితే.. పొరపాటున వారి మధ్య బ్రేకప్ అయితే మాత్రం అదంతా మరో లేవల్. ఇప్పటి దాక వొలక పోసిన ప్రేమంతా మాయమైపోతాయి. కొందరు బ్రేకప్ చేప్తే.. పగను పెంచుకుంటారు. అవతలి వారిని భౌతికంగా దాడులు చేయడం, తెలిసిన వారి దగ్గర బ్లేమ్ చేయడం చేస్తుంటారు. మరికొంత మంది మాత్రం ఇప్పటి వరకు ఖర్చుచేసిన డబ్బులను తిరిగి రాబట్టుకుంటారు. అంతే కాకుండా శాడిస్ట్ లుగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. దక్షిణ కొరియాలోని (South korea) సియెల్ ప్రాంతానికి షాకింగ్ ఘటన సంభవించింది. స్థానికంగా ఉండే 31ఏళ్ల ఓ యువకుడికి, ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కొన్నిరోజుల పాటు వారి ప్రేమాయణం బాగానే సాగింది. అయితే.. ఇటీవల ఏంజరిగిందో కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. యువకుడు మాత్రం కోపంతో రగిలిపోయాడు.
తనకు ఎలాగైన శాస్తి చేయాలనుకున్నాడు. ఒక రోజున యువతికి సంబంధించిన కాస్లీ హ్యండ్ బ్యాగ్ తీసుకున్నాడు. దానిలో మూత్రం పోశాడు. అంతే కాకుండా సెంట్ ను వేశాడు. యువతి దీన్ని అబ్జర్వ్ చేసింది. అతను చేసిన పనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని కోర్టులో హజరుపర్చారు. అతడు చేసిన నేరాన్ని విచారించిన న్యాయస్థానం మన కరెన్సీలో దాదాపు 90 వేల రూపాయలను జరిమానగా విధించింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా (Viral news) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love affair, South korea, VIRAL NEWS