Home /News /trending /

SOUTH DELHI AQUILA RESTAURANT THAT DENIED ENTRY TO WOMAN IN SAREE SHUT DOWN OVER LICENCE SU

చీర కట్టుకుని వచ్చిన మహిళను అనుమతించని రెస్టారెంట్.. గట్టి షాక్ ఇచ్చిన అధికారులు.. ఇప్పుడా రెస్టారెంట్ పరిస్థితి ఏమిటంటే..

చీర కట్టుకొని వచ్చిందని రెస్టారెంట్‌లోకి అనుమతించని యాజమాన్యం (PC: ANI)

చీర కట్టుకొని వచ్చిందని రెస్టారెంట్‌లోకి అనుమతించని యాజమాన్యం (PC: ANI)

దేశ రాజధాని ఢిల్లీలో చీర (Saree) కట్టుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు.. చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చీరకట్టుకున్నందుకు ఆమెను రెస్టారెంట్‌లోని అనుమతించలేదు.

    దేశ రాజధాని ఢిల్లీలో చీర (Saree) కట్టుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు.. చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చీరకట్టుకున్నందుకు ఆమెను రెస్టారెంట్‌లోని అనుమతించలేదు. ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలా చేసిన రెస్టారెంట్ యజమాన్యానికి అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఆ హోటల్‌కు సరైన ట్రేడ్ లైసెన్స్ (trade licence) లేకపోవడంతో నోటీసులు జారీచేసినట్టుగా మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. వివరాలు.. కొద్ది రోజుల కిందట దక్షిణ ఢిల్లీలోని అక్విలా రెస్టారెంట్‌కు చీరకట్టుతో వెళ్లిన తనను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదని అనిత చౌదరి అనే మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. చీర స్మార్ట్, క్యాజువల్‌ డ్రెస్ కోడ్ కిందకు రాదని సిబ్బంది తనతో అన్నట్టుగా ఆమె పేర్కొన్నారు.

    ‘అక్విలా రెస్టారెంట్‌లోనికి చీర కట్టుతో అనుమతించలేదు. ఎందుకంటే చీర అనేది స్మార్ట్ ఔట్ ఫిట్ కాదని వారు చెప్పారు. దయచేసి నాకు Smart outfit అర్ధం చెప్పండి’అని అనిత చౌదరి ట్వీట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసేపుడు అనితా చౌదరి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah), కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి (Hardeep Singh Puri), ఢిల్లీ పోలీస్ కమిషనర్‌, మహిళా కమిషన్‌ని (Women Commission) కూడా ట్యాగ్ చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు ఆ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

    Actress Soujanya: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రాణాలు తీసుకున్న యువనటి సౌజన్య.. సూసైడ్ నోట్‌లో..

    కట్ చేస్తే.. సెప్టెంబర్ 24న అక్విలా రెస్టారెంట్‌ సరైన వ్యాపార అనుమతులు పొందలేదని, ప్రభుత్వ స్థలాన్ని స్థలాన్ని ఆక్రమించిందంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్ నడుపుతున్నారని తమ దృష్టికి వచ్చినట్టుగా తెలిపారు. ‘ఆక్విలా రెస్టారెంట్ సరైన లైసెన్స్ లేకుండా నడుస్తోంది. మేము మూసివేత నోటీసు జారీ చేసిన తర్వాత అది ఇప్పుడు మూసివేయబడింది. మున్సిపాలిటీ ఆమోదం లేకుండా ఈ రెస్టారెంట్ పనిచేస్తున్నందున డీఎమ్‌సీ(ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్) చట్టం ప్రకారం జరిమానా విధించడం సహా ఇతర చర్యలను కూడా మేము అన్వేషిస్తున్నాం’ అని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ పిటిఐకి తెలిపారు. రెస్టారెంట్ మూసివేయబడింది’అని దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్‌డిఎంసి) మేయర్ ముఖేష్ సూర్యన్ (Mukesh Suryan) పిటిఐకి తెలిపారు.

    Junior Artist Suicide: ఆమె తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్.. అలా జరగడంతో ఆత్మహత్య.. గదిలో నుంచి..

    ఈ నేపథ్యంలోనే తాము రెస్టారెంట్‌ను ఈ నెల 27 నుంచి మూసివేస్తున్నట్లు ఆక్విలా రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించింది. వ్యాపార అనుమతులు పొందే వరకూ రెస్టారెంట్‌ను ప్రారంభించబోమని స్పష్టం చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Delhi, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు