ఈ ప్రపంచంలో ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. కట్టు బొట్టు నుంచి తినే తిండి వరకు.. విభిన్నమైన పద్దతులను పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహార అలవాట్లను అక్కడి ప్రజలు పాటిస్తారు. కొన్నిచోట్ల శాఖాహారాన్ని ఎక్కువగా తింటే.. మరికొన్ని చోట్ల మాంసాహారాన్ని ఎక్కువగా తింటారు. మన దేశంలో మాంసాహారం విషయానికొస్తే.. చికెన్, మటన్ ఎక్కువగా తింటారు. కొంత మంది బీఫ్, పోర్క్ని కూడా ఇష్టంగా భుజిస్తారు. ఐతే కొన్ని పాశ్చాత్య దేశాల్లో వీటితో పాటు కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటారు. క్యాటర్ పిల్లర్స్ (Caterpillars)వంటి పురుగులతో రకరకాల వంటకాలను చేసుకుంటారు.
తాళి కట్టు శుభవేళ.. వరుడికి షాక్.. పెళ్లపీటలపై వధువుకి సింధూరం పెట్టిన ప్రియుడు
గొంగళి పురుగులను చూస్తే మనలో చాలా మందికి అసహ్యం వేస్తుంది. వాటిని పట్టుకోవడం కాదు కదా.. చూసేందుకు కూడా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో గొంగళి పురుగులను అందరూ తినేలా.. అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చింది ఓ సౌతాఫ్రికా ఫుడ్ కంపెనీ. క్యాటర్ పిల్లర్స్‌తో ఎంతో రుచికరమైన (Caterpillar snacks) స్నాక్స్ తయారు చేస్తోంది. చాక్లెట్స్, బిస్కెట్స్ చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. గొంగళి పురుగులను తినలేని వారు.. ఈ టేస్టీ ఫుడ్‌ని తినవచ్చని చెబుతోంది. దక్షిణాఫ్రికా కెమికల్ ఇంజనీర్ వెండీ వెసెలా ఈ కీటకాలను పిండిగా మార్చే పద్ధతిని కనుగొన్నారు. దానిని నుంచి స్నాక్స్ తయారు చేస్తున్నారు.
కెమికల్ ఇంజనీర్ వెండీ వెసెల్లా ఒక ప్రత్యేక టెక్నిక్‌ని ఉపయోగించి ఆకుపచ్చ, నలుపు రంగు ముళ్ల గొంగళి పురుగులను పిండిగా మార్చారు. ఆ పిండితోనే బిస్కెట్లు, చాక్లెట్స్, ప్రొటీన్ బార్లు, షేక్స్, స్మూతీస్ తయారు చేసుకోవచ్చు. క్యాటర్ పిల్లర్స్‌ను చూస్తే కొందరికి అసహ్యం వేస్తుంది. కానీ ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేకూర్చే గుణాలు చాలా ఉన్నాయి. అందుకే క్యాటర్పిల్లర్స్ రూపంతో పాటు వాటిని తినే విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు వెండీ వెసెల్లా. ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయవంతమయ్యాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని శాండ్టన్లోని అప్మార్కెట్లో జరిగిన ఫుడ్ ఫెయిర్‌లో క్యాటర్ పిల్లర్ చాక్లెట్స్, బిస్కెట్స్‌ని ప్రదర్శనకు ఉంచినప్పుడు... ఎంతో బాగా స్పందన వచ్చింది. వాటిని చూసి పుడీస్ నోరెళ్లపెడుతున్నారు. ఇవన్నీ క్యాటర్ పిల్లర్స్‌తో తయారు చేశారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు పురుగులు తినడం ఇష్టం ఉండదని.. కానీ వాటితో తయారు చేసిన చాక్లెట్స్ ఎంతో రుచిరకంగా ఉన్నాయని కస్టమర్లు చెబుతున్నారు.
గొంగళి పురుగులు పోషకాహారానికి అద్భుతమైన మూలం. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కానీ ఆ పురుగులను తినేందుకు చాలా మంది వెనకాడతారు. చూస్తేనే.. అసహ్యం వేసేలా ఉండడంతో.. తినడం తర్వాత సంగతి.. అసలు ముట్టుకోవడానికే ఇష్టపడరు. అందుకే వాటి రూపం మార్చి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెండీ వెసెల్లా పేర్కొన్నారు. గొంగళి పురుగులను పెంచడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ప్రత్యేక భూమి కూడా వీటికి అవసరం లేదు. వెండీస్ తీసుకొచ్చి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. కీటకాల నుంచి తయారైన ఆహార పదార్థాలకు పాశ్చాత్య దేశాల ప్రజలు క్రమంగా దగ్గరవుతున్నారు. క్యాటర్ పిల్లర్స్ ప్రొడక్ట్స్ గురించి వెండీస్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వీటితో పిజ్జా టాపింగ్స్ కూడా తయారు చేస్తున్నామని.. త్వరలోనే వీటిని పరిచయం చేస్తామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.