Home /News /trending /

SOUTH ACTRESS TAMANNA BHATIA LIGHTING A LAMP AT AN AWARD FUNCTION VIDEO WENT VIRAL SNR

Tamanna bhatia : అవార్డు ఫంక్షన్‌లో సౌత్ ట్రెడిషన్‌ని ఫాలో అయిన మిల్కీబ్యూటీ .. వైరల్ అవుతున్న తమన్నా వీడియో ఇదే

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Tamanna bhatia: ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15ఏళ్లు అయింది. సుమారు 50సినిమాల్లో యాక్ట్ చేసింది మిల్కీ బ్యూటీ. విదేశాల్లో జరుగుతున్న ఓ అవార్డ్‌ ఫంక్షన్‌కి చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లి ఏం చేసిందో తెలుసా. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India
ఫిల్మ్ ఇండస్ట్రీ(Film industry)లో ట్రెడిషనల్‌(Traditional)గా ఉండటం, సాంప్రదాయాల్ని ఎక్కువగా సౌత్‌ హీరోయిన్‌లు అందులో టాలీవుడ్‌ నటిమణులు ఫాలో అవుతూ ఉంటారు. ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా(Pan India)నుంచి వరల్డ్‌ మూవీ(World Movie)గా మారిపోవడంతో అన్నీ భాషల సినిమాల్లో ఉత్తర, దక్షిణాది తారలు యాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన తమన్నా ఉత్తర, దక్షిణాది భాషల సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అయితే మెల్‌బోర్న్‌(Melbourne)లో జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(Indian Film Festival)కి వెళ్లిన మిల్కీ బ్యూటీ అక్కడ ఈవెంట్‌ లాంచ్‌కి ముందు సాంప్రదాయానికి ఇచ్చిన విలువతో అందరి హృదయాలను గెలుచుకుంది.

Sita Ramam: సీతారామం సంతృప్తి ఇచ్చిందన్న .. మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి



తమన్నా వీడియో వైరల్ ..
మిల్కీబ్యూటీ తమన్నాకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు బిగ్‌ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్‌ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ మెల్‌బోర్న్‌కి చీఫ్‌ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు తమన్నా. ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం భారతదేశ సాంప్రదాయం. ఆస్ట్రేలియాలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి కూడా నిర్వాహకులు అలాంటి ఏర్పాటే చేశారు. చీఫ్‌ గెస్ట్‌లుగా అటెండ్ అయిన తమన్నా భాటియా, తాప్సీని జ్యోతి ప్రజ్వలన చేశారని నిర్వాహకులు కోరారు. ముందుగా హీరోయిన్ తాప్సీ హై హీల్స్ వేసుకొని ఓ దీపాన్ని వెలిగించారు. ఆ తర్వాత మరో దీపాన్ని వెలిగించమని తమన్నాను కోరడంతో ఆమె తన కాళ్లకు ఉన్న చెప్పులను దూరంగా వదిలిపెట్టి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు.




సౌత్‌ ట్రెడిషనల్‌ని చాటుకున్న బ్యూటీ..
తమన్నాభాటియా విదేశాల్లో జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో సాంప్రదాయలను గౌరవించడం అక్కడున్న వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు.పక్కనే ఉన్న కార్యక్రమ నిర్వాహకురాలు ఇలా ఎందుకు చేసిందని ప్రశ్నిస్తే ..అది దక్షిణాది సంస్కృతి అని బదులిచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటీ,నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి ఇంకా తక్కువనే చెప్పాలి. కాని తమన్నా ప్రవర్తించిన తీరు చూసి ఉత్తరాది సెలబ్రిటీలు అంతా తెలుగు నటి అనిపించుకుందని మెచ్చుకుంటున్నారు.ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


ఇప్పుడిదే హాట్‌ టాపిక్...
తమన్నా చెప్పులు వదిలిపెట్టి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వీడియోని మిల్కీ బ్యూటీ అభిమాని ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు “తమన్నాకి సౌత్ నేర్పింది ఇదే కదా, సంస్కృతిని గౌరవించడం అంటే ఇదే కదా, చిన్న చిన్న విషయాలే పెద్ద తేడా” అంటూ తమన్నా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పిందంటూ కితాబిస్తున్నారు. మిల్కీ బ్యూటీని ఆకాశానికి ఎత్తెస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Tamannaah Bhatia, Tollywood actress, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు