హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Sourav Ganguly : మళ్లీ Covid.. ఈసారి డెల్టా ప్లస్.. డిశ్చార్జ్ అయినా దాదాను వదలని మహమ్మారి

Sourav Ganguly : మళ్లీ Covid.. ఈసారి డెల్టా ప్లస్.. డిశ్చార్జ్ అయినా దాదాను వదలని మహమ్మారి

గంగూలీ (ఫైల్ ఫోటో)

గంగూలీ (ఫైల్ ఫోటో)

సౌరవ్ గంగూలీని కరోనా మహమ్మారి ఎంతకీ వదలట్లేదు. వైరస్ బారినపడి కోల్ కతాలోని ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స పొంది, నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయిన దాదాకు శనివారం రాత్రి చేసిన పరీక్షల్లో మళ్లీ కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. పూర్తి వివరాలివి..

ఇంకా చదవండి ...

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కరోనా మహమ్మారి ఎంతకీ వదలట్లేదు. వైరస్ బారినపడి కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో నాలుగు రోజులు చికిత్స పొందిన దాదా శుక్రవారం నాటి పరీక్షల్లో నెగటివ్ ఫలితాలు రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. కానీ శనివారం సాయంత్రం తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు మళ్లీ కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి వుడ్ ల్యాండ్ ఆస్పత్రి వర్గాలు చెప్పిన వివరాలివి..

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో డెల్టాప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు శనివారం రాత్రి ప్రకటన చేశాయి. అయితే, కొవిడ్ లక్షణాలు, వ్యాధి తీవ్రత చాలా స్వల్పంగా ఉండటంతో ఈసారి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు గంగూలీ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారని వుడ్ ల్యాండ్ ఆస్పల్రి వర్గాలు పేర్కొన్నాయి.

Earthquake : పాకిస్తాన్‌ను వణికించిన భూకంపం.. మన జమ్మూకాశ్మీర్, LoC వెంబడీ ప్రకంపనలు



ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో గత సోమవారం రాత్రి గంగూలీ కోల్ కతా సిటీలోని ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేరారు. ఆక్కడ ఆయనకు ‘మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ థెరపీ’ అందించడంతో కోలుకున్నాడు. నాలుగు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మరోమారు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ అని తేలడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ శనివారం నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది.

Shamirpet : మాస్క్ పెట్టుకోలేదని.. 9th విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారం.. ఓ పార్టీ అండతో



ఇన్ఫెక్షన్ తీవ్రత ఆందోళన చెందే స్థాయిలో లేకపోవడంతో ఇంటి వద్దే ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 15 రోజులపాటు గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉంటారని వుడ్ ల్యాండ్ ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు. గంగూలీకి ఒమిక్రాన్ పాజిటివ్ లేకపోవడం ఊరట కలిగించినప్పటికీ, ఇలా గంటల వ్యవధిలోనే నెగటివ్, పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

First published:

Tags: Bcci, Covid-19, Kolkata, Sourav Ganguly

ఉత్తమ కథలు