Kulhad Chai: మట్టి గ్లాసులోనే ఛాయ్... కేంద్రం కీలక నిర్ణయం

స్థానికంగా కుండలు, మట్టిపాత్రలు తయారు చేసేవారికి ఉపాధి అవకాశాల్ని పెంచడంతో పాటు, ప్లాస్టిక్, పేపర్ గ్లాసుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: August 26, 2019, 1:05 PM IST
Kulhad Chai: మట్టి గ్లాసులోనే ఛాయ్... కేంద్రం కీలక నిర్ణయం
Kulhad Chai: మట్టి గ్లాసులోనే ఛాయ్... కేంద్రం కీలక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 26, 2019, 1:05 PM IST
మీరు ప్లాస్టిక్ గ్లాస్‌లో ఛాయ్ తాగుతున్నారా? త్వరలో రైల్వేస్టేషన్లు, బస్టాప్స్‌లో మీరు ఛాయ్ తాగాలంటే ప్లాస్టిక్ గ్లాసులు కనిపించవు. ప్లాస్టిక్ మాత్రమే కాదు... పేపర్ గ్లాసులు, గాజు గ్లాసులు కూడా ఉండవు. ఛాయ్‌వాలా మీకు మట్టి గ్లాసులో టీ ఇస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం తీసుకునే చర్యల్లో ఇది కూడా ఒకటి. ప్లాస్టిక్ గ్లాసుల్లో కాకుండా మట్టి గ్లాసులో ఛాయ్ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలంటే రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌‌కు కేంద్ర రవాణా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలోని వారణాసి, రాయ్ బరేలీ రైల్వే స్టేషన్లలో టెర్రకోటతో తయారు చేసిన మట్టి గ్లాసులు, పాత్రల్నే ఉపయోగిస్తుండటం విశేషం. ఈ మట్టి గ్లాసుల్నే కుల్హర్, కుల్హద్ అని పిలుస్తుంటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఛాయ్, మజ్జిగ ఇచ్చేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు.

భారతదేశంలోని 100 రైల్వే స్టేషన్లలో మట్టి గ్లాసులు, పాత్రల్ని వినియోగించాలని పీయూష్ గోయల్‌కు నేను లేఖ రాశాను. అంతేకాదు... అన్ని బస్ స్టాపులు, ఎయిర్‌పోర్టుల్లో మట్టి గ్లాసుల్ని వినియోగించడం తప్పనిసరి చేయాలని కోరాను. మాల్స్‌లోని టీ స్టాల్స్‌లో కూడా వీటని ఉపయోగించేలా ప్రోత్సహించాలి.
నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి


స్థానికంగా కుండలు, మట్టిపాత్రలు తయారు చేసేవారికి ఉపాధి అవకాశాల్ని పెంచడంతో పాటు, ప్లాస్టిక్, పేపర్ గ్లాసుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ డిమాండ్ చేశారు. అంతేకాదు... డిమాండ్‌కు తగ్గట్టుగా భారీగా మట్టి గ్లాసుల్ని తయారు చేయాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్-KVIC సంస్థను ఆదేశించారు. కుండలు, మట్టిపాత్రలు తయారు చేసేవారికి ఇప్పటికే 10,000 ఎలక్ట్రిక్ వీల్స్‌ని పంపిణీ చేసింది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ ఏడాది 25,000 ఎలక్ట్రిక్ వీల్స్‌ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మట్టి గ్లాసులో ఛాయ్, మజ్జిగ సప్లై చేయాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు... 2004 లోనే అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు.



Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
Xiaomi Loan: అప్పులు ఇవ్వనున్న షావోమీ... వడ్డీ రూ.2 లోపే

IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

New Smartphone: 4 రోజుల్లో 4 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... వీటిలో ఏది బెటర్?
First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...