Home /News /trending /

SONU SOOD SISTER MALVIKA TO CONTEST PUNJAB POLLS ACTOR ALSO TOLD ON HIS OWN INTENTION TO JOIN POLITICS MKS

పోలిటికల్ ఎంట్రీపై Sonu Sood కీలక ప్రకటన -పంజాబ్ బరిలో నటుడి సోదరి Malvika -ఏ పార్టీ అంటే..

మొగలో సోసూ సూద్ ప్రెస్ మీట్, పక్కనే సోదరి మాళవిక

మొగలో సోసూ సూద్ ప్రెస్ మీట్, పక్కనే సోదరి మాళవిక

ప్రముఖ నటుడు, దాత, సామాజిక సేవకుడు సోనూ సూద్ తన రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో తన సోదరి మాళవికా సూద్ పొలిటిక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు మంచి పార్టీలుగా భావిస్తున్నామని సోనూ వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...
ప్రముఖ నటుడు, దాత, సామాజిక సేవకుడు సోనూ సూద్ తన రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో తన సోదరి మాళవికా సూద్ పొలిటిక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్ లోని మొగలో తన నివాసం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ సంబంధిత అనేక విషయాలను సోనూ సూద్ పంచుకున్నారు. కరోనా విలయ కాలంలో పేదలకు భారీ సేవలు చేసిన సోనూ సూద్ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయన అభిమానులందరూ కోరుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో..

తన సోదరి మాళవిక సూద్ వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తారని సోనూ సూద్ ప్రకటించారు. ‘మాళవిక అన్ని రకాలుగా రెడీ అయింది. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె కమిట్మెంట్ దేనికీ సాటిరాదు. నిజానికి ఒక రాజకీయ పార్టీలో చేరడం లేదా రాజకీయాల్లోకి రావడం అనేది జీవితంలో అతి పెద్ద నిర్ణయం అవుతుంది. అయితే, ఏ పార్టీలో చేరాలన్నది ఐడియాలజీని బట్టి ఉంటుంది. పలు పార్టీల నేతలు ఎంతో మందితో క్యాజువల్ మీటింగ్స్ జరుగుతున్నప్పటికీ, సిద్ధాంతాలే ముఖ్యమన్నది మా కుటుంబం నమ్ముతోంది’అని సోనూ సూద్ వ్యాఖ్యానించారు.

పంజాబ్ ఎన్నికల్లో మాళవిక సూద్ ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనేది త్వరలోనే వెల్లడిస్తామని సోనూ సూద్ చెప్పారు. అయితే, ఇప్పటివరకు తమకున్న నమ్మకాల ప్రకారం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీలు మంచి పార్టీలుగా భావిస్తున్నామని సోనూ వ్యాఖ్యానించారు. మాళవిక ఇటీవలే పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీతో భేటీ అయిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లోకే వెళతారా? అన్న ప్రశ్నకు సోనూ సమాధానం దాటవేశారు. కాగా,

తన పొలిటికల్ ఎంట్రీపైనా నటుడు సోనూ సూద్ క్లారిటీ ఇచ్చారు. తన తరహాలో పనిచేసుకోడానికి స్వేచ్ఛ ఇచ్చే ఏ వేదికలోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నానని, అది రాజకీయ వేదికైనా కావొచ్చే లేదా రాజకీయాలతో సంబంధం లేని వేదికైనా కావొచ్చు అని సోనూ సూద్ చెప్పారు. ఐడియాలజీ ప్రధానంగానే తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. గతంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను, పంజాబ్ సీఎం చన్నిని కలిసిన సోనూ సూద్, త్వరలో అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కూడా కలవబోతున్నట్లు తెలిపారు. మొత్తానికి సోదరి మాళవిక ఏ పార్టీలో చేరుతుందనే క్లారిటీ ఇవ్వకుండానే పొలికల్ ఎంట్రీని ప్రకటించిన సోనూ సూద్.. తన వ్యక్తిగత ఎంట్రీపైనా దాదాపు అదే అస్పస్టత కొనసాగించారు.
Published by:Madhu Kota
First published:

Tags: 5 State Elections, Punjab, Sonu Sood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు