Sonu sood: 4 రోజుల అనంతరం జనం ముందుకు సోనూసూద్..​ ఐటీ అధికారులపై సెటైర్​

సోనూసూద్​ (ఫైల్)

ఇటీవల సోనూసూద్​ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోనూసూద్​ రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్​ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు కూడా. అయితే ఇపుడు సోనూసూద్​ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు సోషల్​ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. ఐటీ అధికారులపై సెటైరికల్​గా రాశాడు. అదేంటంటే

  • Share this:
    బాలీవుడ్​ నటుడు సోనూసూద్ (Sonu sood)  కరోనా సమయంలో వందలాది మందికి సాయం అందించారు. ఈ సేవాగుణం కారణంగా దేశవ్యాప్తంగా (nationwide) ఆయనకు లక్షలాది మంది అభిమానులు (fans) అయిపోయారు. పెద్దపెద్ద సెలెబ్రెటీలు సైతం ఆయనను ప్రశంసించారు.  ఇంత ఫాలోయింగ్​ ఉన్న నటుడిపై అప్పుడప్పుడు విమర్శలు, రాజకీయ ఒత్తిడిలు వచ్చాయి. ఫలానా పార్టీకి వ్యతిరేకం అంటూ.. ఫలానా పార్టీకి మద్దతు అంటూ.. ఇక రాజకీయాల్లోకి వస్తారంటూ.. సోషల్​మీడియా (Social media)లో చర్చలూ వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని సోనూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇటీవల సోనూసూద్​ ఇళ్లపై ఐటీ శాఖ (Income tax) దాడులు  (raids)నిర్వహించిన సంగతి తెలిసిందే. సోనూసూద్​ రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్(tax)​ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు (Officials) వెల్లడించారు కూడా. అయితే ఇపుడు సోనూసూద్ (sonu sood)​ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు సోషల్​ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు (Interesting post) చేశాడు. ఐటీ అధికారులపై సెటైరికల్​ (satirical)గా రాశాడు. అదేంటంటే

    ఆదాయపు పన్ను అధికారులు సోనూసూద్​ ఇళ్లపై దాడి చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల పాటు ఆయన ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై సోనూసోద్​ ట్విటర్లో (Twitter) స్పందించారు.  ప్రతీ భారతీయుడి (Every Indian) ప్రార్థనలు (prayers) ప్రభావం చూపుతాయని, కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణం సాగుతుందని అన్నారు. తను పొదుపు చేసే ప్రతీ రూపాయి పేదల విలువైన జీవితాలను కాపాడటానికే అని అన్నారు. అయితే ఈ నాలుగు రోజులు నా అతిథులతో ( ఐటీ అధికారులతో) బిజీగా ఉన్నానంటూ సెటైర్​ వేశారు.


    ‘‘ భారత ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నాకు నేను ప్రతిజ్ఙ చేసుకున్నాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదల విలువైన జీవితాల కోసం పొదుపుచేసిందే. అంతేకాకుండా మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. గత నాలుగు రోజులుగా నేను నా అతిథుల (ఐటీ అధికారుల)తో బిజీగా ఉన్నాను. అందుకే మీ సేవలో ఉండలేకపోయాను. నేను మళ్లీ మీ జీవితాల కోసం తిరిగొచ్చాను.”అని ట్విటర్​లో సోనూ సూద్​ పోస్టు పెట్టారు.

    దాడులపై ఏం చెప్పారంటే..

    సోనూసూద్ లావాదేవీలు, పన్ను ఎగవేతపై ఐటీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు దాడులు చేసింది. దేశవ్యాప్తంగా అభిమానులు విమర్శలు గుప్పించడంతో ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది. తనిఖీల్లో రూ .20 కోట్లకు పైగా పన్నులు సోనూసూద్​ ఎగవేసినట్లు (Evaded tax) బయటపడిందని ఆదాయపు పన్ను శాఖ (Income tax) తెలియజేసింది. సోనూకు సంబంధించిన ముంబై (Mumbai), లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ మరియు గుర్గావ్‌లలోని మొత్తం 28 ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. 21 జూలై 2020 న సోనూసూద్​ స్థాపించిన ఛారిటీ ఫౌండేషన్ 01.04.2021 నుంచి ఇప్పటి వరకు 18.94 కోట్ల రూపాయల విరాళాలను (Donations) సేకరించిందని, అందులో దాదాపు రూ. 1.9 కోట్లు వివిధ సహాయక పనులకు, మిగిలిన రూ. 17 కోట్లు ఫౌండేషన్ బ్యాంక్ ఖాతాలో నిరుపయోగంగా (Unused) ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

    Read this Also: బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ ఇళ్లల్లో తనిఖీలపై ఐటీ శాఖ ప్రకటన.. దాడులు ఎందుకు చేశారంటే?
    Published by:Prabhakar Vaddi
    First published: