హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Sonia Gandhi: కాంగ్రెస్ శ్రేణులకు తీపికబురు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ

Sonia Gandhi: కాంగ్రెస్ శ్రేణులకు తీపికబురు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ

కారులో ఇంటికి వెళ్తున్న సోనియా గాంధీ

కారులో ఇంటికి వెళ్తున్న సోనియా గాంధీ

Delhi: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా వారం క్రితం సోనియా గాంధీ ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు.

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia gandhi) ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కాగా, 75 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 2 న కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత.. వైరస్ (Covid) తగ్గుముఖం పట్టడంతో గత వారం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. దీంతో వారం క్రితం మరోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

అక్కడ మరల వైద్యులు ట్రీట్ మెంట్ అందించారు. వారం తర్వాత.. సోమవారం సోనియాను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సోనియా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు(Congress party)  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate)  జూన్ 23న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. ఇక , రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై దర్యాప్తు సంస్థలు కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. అనేక చోట్ల కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

ఇదిలా ఉండగా గతంలోనూ సోనియా ఆస్పత్రిలో చేరారు

జాతీయ కాంగ్రెస్ (Congress) అధ్యక్షురాలు సోనియా గాంధీ (75) (Sonia Gandhi) ఆరోగ్య పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉందని, ఆమెకు శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ సోకిందని, కొవిడ్ (Covid) అనంతర సమస్యలతో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని పార్టీ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలోనే ఉన్న అధినేత్రి ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఇవాళ కీలక సమాచారం వెల్లడించారు.

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శ్వాస‌కోశ ఇన్ఫెక్ష‌న్‌తో పాటు పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాల‌కు చికిత్స పొందుతున్నార‌ని, ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారని పార్టీ నేతలు తెలిపారు. క‌రోనా వైర‌స్ సోక‌డం, ముక్కు నుంచి ర‌క్త‌స్రావం కావ‌డంతో జూన్ 12న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సోనియాగాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించిన వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అలాగే సోనియాగాంధీ ఇతర పోస్ట్ - కోవిడ్ లక్షణాలకు సంబంధించిన చికిత్స కూడా పొందుతున్నారని జైరామ్ రమేష్ వెల్లడించారు.

First published:

Tags: Covid, Covid-19, Delhi, Sonia Gandhi

ఉత్తమ కథలు