ఆమె డబ్బున్న పశువు.. సోనాక్షి సిన్హాపై నోరు జారిన యూపీ మంత్రి

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై యూపీ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డబ్బున్న పశువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 24, 2019, 4:40 PM IST
ఆమె డబ్బున్న పశువు.. సోనాక్షి సిన్హాపై నోరు జారిన యూపీ మంత్రి
సోనాక్షి సిన్హా
  • Share this:
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై యూపీ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డబ్బున్న పశువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే.. గత వారం కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హాజరైన సోనాక్షి సిన్హా.. రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోవడమే కాకుండా.. లైఫ్ లైన్ తీసుకుంది. అయినా కూడా తప్పు జవాబిచ్చింది. దాంతో సోనాక్షి తల్లి పూనమ్‌తో పాటు అమితాబ్ కూడా షాకయ్యాడు. వాస్తవానికి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా తన ఇంటికి రామాయణ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు తన ఇద్దరు కుమారులకు శ్రీసీతారాముల కుమారులైన లవకుశల పేర్లు పెట్టారు. రాముడిని అంతగా కొలిచే ఆ కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు జవాబివ్వకపోవడం గమనార్హం.

చిన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేకపోయిందంటూ.. సోనాక్షిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వారితో పాటు యూపీ మంత్రి సునీల్ భరాలా కూడా గొంతు పాడారు. ఇంకాస్త ఘాటుగా మాట్లాడిన ఆయన.. సోనాక్షి ‘ధన పశువు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా.. ‘ఈ కాలంలో ఇలాంటి నటీనటులు కేవలం డబ్బు కోసమే బతుకున్నారు. డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చుపెట్టాలి? అని మాత్రమే ఆలోచిస్తారు. చరిత్ర గురించి దేవుళ్ల గురించి అసలు ఏమీ తెలీదు. నేర్చుకోవడానికి సమయం కూడా కేటాయించరు. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై సోనాక్షి ఇంకా స్పందించలేదు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>