SON SURPRISES DAD WITH A KIA SELTOS CAR GIFT VIDEO GOES VIRAL SRD GH
Son's Gift: ఖరీదైన గిఫ్ట్‌తో తండ్రిని సర్ప్రైజ్ చేసిన కొడుకు.. ఇంతకీ అదేంటో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Son's Gift: భారతీయ సాంప్రదాయంలో బహుమతులకు ఎంతో విలువుంటుంది. పుట్టినరోజు, వేడుకలు, పండుగల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక వారి పుట్టినరోజు నాడు బైక్, కారు వంటి ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు.
భారతీయ సాంప్రదాయంలో బహుమతులకు ఎంతో విలువుంటుంది. పుట్టినరోజు, వేడుకలు, పండుగల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక వారి పుట్టినరోజు నాడు బైక్, కారు వంటి ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు. అందుకే అనేక వాహనాల వెనకాల "ఫాదర్ గిఫ్ట్" లేదా ‘‘మదర్ గిఫ్ట్” అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. అయితే, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ఇలా బహుమతి ఇస్తుంటారు. కానీ, పిల్లలే తల్లిదండ్రులకు బహుమతి ఇచ్చే సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అటువంటి అరుదైన ఘటనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన జజ్బా దర్శన్ దోషి అనే వ్యక్తి తన తండ్రి 60వ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే సరికొత్త కియా సెల్టోస్ కారును బహుమతిగా ఇచ్చి ఆయనను సర్ప్రైజ్ చేశాడు. తన తండ్రికి కారు బహుమతిగా ఇస్తుండగా తీసిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూజర్స్‌తో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా జబ్బా దర్శన్‌ను మెచ్చుకుంటున్నారు.
వీడియోను గమనిస్తే.. నలుపు రంగులోని సరికొత్త కియా సెల్టోస్‌ను పువ్వులు, రిబ్బన్లతో సుందరంగా ముస్తాబు చేశారు. అతని తండ్రిని పిలవడానికి ముందే కుటుంబసభ్యులు, అపార్ట్మెంట్ వాసులు అంతా కారు చుట్టూ గుమిగూడారు. ఆ తర్వాత జజ్బా దర్శన్ దోషి తన తండ్రిని కిందికి పిలిచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. కారు కీస్‌ను తన చేతికి అందించాడు. ఖరీదైన ఆ సర్ప్రైజ్ బహుమతిని చూడగానే తండ్రి బావోద్వేగానికి లోనయ్యాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.. అతను కారులో కూర్చుని కుటుంబసభ్యులతో కలిసి కొద్ది దూరం వరకు ప్రయాణించాడు. చివరగా ప్రియమైన నాన్నకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొంటూ వీడియో ముగుస్తుంది.
అత్యధికంగా అమ్ముడవుతున్న కియా సెల్టోస్..
కొరియన్ బ్రాండ్ కియా మోటార్స్ కియా సెల్టోస్ ఎస్‌యూవీని రెండేళ్ల క్రితమే భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీతో నడిచే ఈ వాహనం అత్యధికంగా అమ్ముడవుతూ.. గణనీయమైన వృద్దిరేటును సంపాదించుకుంది. కియా సెల్టోస్ 1.5 -లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 1.5 -లీటర్ పెట్రోల్, 1.5 -లీటర్ టర్బోచార్జ్ డీజిల్,- 1.4- లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్ వంటి మూడు ఇంజిన్ ఆప్షన్లతో మాన్యువల్ ట్రాన్స్మిషన్లతో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ అడ్వాన్సుడ్ 7 -స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. కియా మోటార్స్ నుంచి భారత మార్కెట్లోకి వచ్చిన మొదటి వేరియంట్ సెల్టోస్. ప్రస్తుతం, కియా తన సోనెట్, కార్నివాల్ వేరియంట్లను కూడా మార్కెట్లో అందిస్తుంది. రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లోకి మరిన్ని కొత్త కార్లను విడుదల చేయాలని కియా మోటార్స్ యోచిస్తోంది.