• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • SON SINGS TO DYING MOTHER IN HOSPITAL ON A CALL WITH DOCTOR VIDEO GOES VIRAL SK GH

కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం పాట పాడిన తనయుడు.. కంట తడిపెట్టిస్తున్న ట్వీట్

కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం పాట పాడిన తనయుడు.. కంట తడిపెట్టిస్తున్న ట్వీట్

ప్రతీకాత్మక చిత్రం

కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం తనయుడు పడిన ఆరాటం తమను కన్నీరు పెట్టించిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. తన తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ చాలా గొప్పందంటూ కామెంట్స్​ చేస్తున్నారు.

  • Share this:
దేశంలో రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్ని రక్షించేందుకు ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ అహర్నిషలు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ, చేయి దాటిపోయిన కొంతమంది రోగుల పరిస్థితి వాళ్లకే కళ్లు చెమర్చేలా చేస్తోంది. అన్నీ తెలిసిన వారినే ఏమీ చేయలేని నిస్సహాయులుగా మర్చేస్తోంది కరోనా మహమ్మారి. తాజాగా, ఇలాంటి ఓ హృదయ విదారక ఘటన గురించి ఓ వైద్యురాలు ట్విట్టర్​లో షేర్​ చేశారు. మరణం అంచుల్లో ఉన్న ఓ తల్లి కోసం తనయుడు పడిన ఆరాటాన్ని తన ట్వీట్​లో వివరించారు. ఈ పోస్ట్​ చూసిన వారందరూ బావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక పూర్తి విరాల్లోకి వెళ్తే.. కోల్​కతా అపోలో గ్లెనెగల్స్‌లోని క్రిటికల్ కేర్ డాక్టర్ డిప్షికా ఘోష్ చేసిన ట్వీట్​ ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.

ఆమె బుధవారం పెట్టిన ట్వీట్​లో ఇలా రాసుకొచ్చారు.. “నా డ్యూటీ ముగించుకొని వెళ్లిపోతున్న సమయంలో ఓ యువకుడు కాల్​ చేశాడు. మేడం ప్లీజ్​ నేను మా అమ్మతో మాట్లాడాలి. నేను వీడియో కాల్​ మాట్లాడేదాక వెయిట్​ చేయరా? అని రిక్వెస్ట్​ చేశాడు. నేను సరేనని చెప్పి.. ఐసీయూ​లో కొన ఊపిరితో ఉన్న తన తల్లిని చూపించాను. అతను తన తల్లి వైపు చూస్తూ బావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లిని ఓదార్చేందుకు 1973లో విడుదలైన ‘ఆ గేల్ లాగ్ జా’ చిత్రంలోని ‘తేరా ముజ్సే హై పెహ్లే కా నాతా కోయి’ అనే హిందీ పాటను ఆలపించాడు. అతను పాట పాడుతుంటే మా సిబ్బంది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అతడు తన తల్లిని తలుచుకుంటూ దు:ఖంతో పాట పాడుతూ మధ్యలో ఒక్కసారిగా భోరుమంటూ విలపించాడు. దు:ఖంతో నిండిన గొంతుతోనే పాటనంతా పూర్తి చేశాడు. తన తల్లి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నాడు. నాకు కృతజ్ఞతలు చెప్పి ఫోన్​ పెట్టేశాడు’’ అంటూ పోస్ట్​లో పేర్కొన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన మా అందరికీ కళ్లు చెమర్చాయి. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదంటూ ఆమె వేడుకున్నారు.


కొన ఊపిరితో ఉన్న తల్లి కోసం తనయుడు పడిన ఆరాటం తమను కన్నీరు పెట్టించిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. తన తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ చాలా గొప్పందంటూ కామెంట్స్​ చేస్తున్నారు. అంతేకాకుండా, కరోనా కారణంగా తమ వారిని కోల్పోయిన హృదయ విదారక సంఘటనలను పంచుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు చేస్తోన్న సేవలను కొనియాడారు. ఈ పోస్ట్ ఇప్పటివరకు 10,000 సార్లు రీట్వీట్ చేయబడింది. పోస్ట్​కు దాదాపు 40,000 లైక్‌లు, 1,500 కి పైగా కామెంట్స్​ పొందింది.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు