తండ్రి గిఫ్ట్ ఇచ్చిన మందు బాటిళ్లు అమ్మితే కొడుక్కి ఇల్లొచ్చింది

స్కాట్లాండ్‌కు చెందిన పీట్ రాంబ్సన్ అనే వ్యక్తికి 1992లో కుమారుడు మథ్యూ జన్మించాడు. అప్పటి నుంచి తన కుమారుడికి ప్రతి పుట్టిన రోజు నాడు ఒక విస్కీ బాటిల్ గిఫ్ట్‌గా ఇవ్వడం అలవాటుగా పెట్టుకున్నాడు.

news18-telugu
Updated: September 9, 2020, 6:47 PM IST
తండ్రి గిఫ్ట్ ఇచ్చిన మందు బాటిళ్లు అమ్మితే కొడుక్కి ఇల్లొచ్చింది
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పుట్టినరోజు, పండుగలు, వార్షికోత్సవాలు, ప్రత్యేక రోజుల్లో బహుమతులు ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం. కానీ ఒక తండ్రి తనకు బాబు పుట్టినప్పటి నుంచి ప్రతి పుట్టిన రోజుకి ఒక విస్కీ బాటిల్ను బహుమతిగా ఇస్తూ వచ్చాడంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అంతకు మించిన ఆశ్చర్యం ఏంటంటే... 28ఏళ్లుగా తన తండ్రి బహుకరించిన మద్యం సీసాలను అమ్మి వచ్చిన డబ్బుతో కొడుకు ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నాడట.

వివరాల్లోకి వెళ్తే.. స్కాట్లాండ్‌కు చెందిన పీట్ రాంబ్సన్ అనే వ్యక్తికి 1992లో కుమారుడు మథ్యూ జన్మించాడు. అప్పటి నుంచి తన కుమారుడికి ప్రతి పుట్టిన రోజు నాడు ఒక విస్కీ బాటిల్ గిఫ్ట్‌గా ఇవ్వడం అలవాటుగా పెట్టుకున్నాడు. మొదటి పుట్టిన రోజుకి 18 సంవత్సరాల పాతదైన విస్కీ బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పటి నుంచి మాథ్యూకు 18ఏళ్లు వచ్చే వరకు ఆ అలవాటును కొనసాగించాలనుకున్నాడు. కానీ, 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆ అలవాటును కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు మాథ్యూకి 28ఏళ్లు వచ్చాయి. మెకల్లన్ సింగల్ మాల్ట్ విస్కీ 28 సీసాలు కొనడానికి తండ్రి పీట్‌ సుమారు 5000 యూరోలు (సుమారు రూ .5 లక్షలు) ఖర్చు చేశాడు. ఇన్ని సంవత్సరాల తరువాత వాటి విలువ 40,000 యూరోలు (సుమారు రూ.40 లక్షలు)కు పెరిగింది. ఇప్పుడు, మాథ్యూ ఆ మద్యం సీసాలను విక్రయించి, వచ్చే డబ్బుతో సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నాడట.

"మథ్యూ పుట్టినప్పుడు శిశువు తల మీద రాయడానికి ( అది ఒక రకమైన సంప్రదాయం) మొదటి బాటిల్ను కొన్నాను. ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరం ఒక మద్యం సీసాను గిఫ్ట్‌గా ఇస్తే ఆసక్తికరంగా ఉంటుందనుకున్నాను. 18 ఏళ్ల పాత విస్కీని బహుమతిగా ఇవ్వడం అనే ఆలోచన 18వ పుట్టినరోజుతో ముగించాలనుకున్నాను" అని పీట్ పేర్కొన్నాడు. శిశువుకు విస్కీ బహుమతిగా ఇవ్వడం అసాధారణమైన విషయం అని మాథ్యూ అన్నాడు. "ఇలాంటి బహుమతులను ఓపెన్ చేయకుండా ఇన్నాళ్లూ ఉండడం కష్టమే. కానీ వాటిని ఎప్పుడూ తెరవవద్దని నేను నిర్ణయించుకున్నాను" అని వివరించాడు. విస్కీలతో పాటు మాథ్యూకు ఇతర బహుమతులు కూడా లభించాయి. కానీ ప్రత్యేకమైన ఈ సంప్రదాయానికి అతడి సహనం తోడవ్వడంతో ఇల్లు కట్టుకోవడానికి అతడు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేకుండా పోయింది. మద్యం అమ్మకాన్ని నిర్వహించే బాధ్యతను ఆ కుటుంబం ఓ సంస్థకు అప్పగించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 9, 2020, 6:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading