Viral Video: లైవ్‌లో మాట్లాడుతున్న కేంద్రమంత్రి.. హఠాత్తుగా డోర్ తీసుకుని వచ్చిన కొడుకు.. ఏం చేశాడంటే..

లైవ్‌లోకి వచ్చిన మంత్రి కుమారుడు

Viral News: జూమ్ ద్వారా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటున్న మంత్రి కార్మెల్ దగ్గరకు సడెన్‌గా ఆమె కుమారుడు వచ్చాడు.

 • Share this:
  మంత్రుల మీటింగ్ అంతా అఫీషియల్‌గా ఉంటుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారి ప్రసంగాలు కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోతుంటాయి. ఇందుకు సంబంధించి సంబంధిత మంత్రులు లేదా వారి దగ్గర ఉండే అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రత్యక్ష ప్రసారం సమయంలో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ తరువాత కొత్త సమస్యలు వస్తాయన్నది చాలామంది ప్రజాప్రతినిధుల ఫీలింగ్. అయితే ఓ దేశానికి చెందిన కేబినెట్ మంత్రి ప్రత్యక్ష ప్రసారంలో ఉండగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కారణంగా ఆ మంత్రిగారు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. న్యూజిలాండ్‌కు చెందిన సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి కార్మెల్ సెపులొని లైవ్‌లో మాట్లాడుతుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

  జూమ్ ద్వారా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటున్న మంత్రి కార్మెల్ దగ్గరకు సడెన్‌గా ఆమె కుమారుడు వచ్చాడు. ఏదో అలా వచ్చి తన పని చేసుకుని వెళ్లిపోతే బాగుండేది. కానీ ఆ అబ్బాయి అలా చేయలేదు. ఓ క్యారెట్‌ను తీసుకొచ్చి తన తల్లికి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో కార్మెల్ కాసేపు అతడిని సముదాయించి అక్కడి నుంచి పంపించేసింది.  అయితే ఆ తరువాత ఈ ఘటనపై కార్మెట్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ఈ క్యారెట్ కోసం తన కుమారుడు, తాను కొట్టుకున్నంత పని చేశామని పేర్కొంది.

  ప్రస్తుతం న్యూజిలాండ్‌లో నాలుగు దశల లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని మూతపడ్డాయి. కొద్దిరోజుల క్రితం డెల్టా వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు వెలుగులోకి రావడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం వెంటనే లాక్‌డౌన్ ప్రకటించింది.

  <a href="https://telugu.news18.com/news/politics/revanth-reddy-trying-hard-to-attract-trs-senior-leader-ex-minister-tummala-nageshwar-into-congress-ak-1017070.html"><span style="color: #ff0000;">Telangana: రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. టీఆర్ఎస్ కీలక నేతపై ఫోకస్.. వర్కవుట్ అవుతుందా ?</span></a>

  <a href="https://telugu.news18.com/photogallery/life-style/these-plant-leaves-will-help-you-in-controlling-diabetes-here-is-the-details-ak-1017036.html"><span style="color: #ff0000;">Diabetes: ఇంట్లో ఈ చెట్లను పెంచుకోండి.. మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోండి.. ఎలా అంటే..</span></a>

  కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాని నిర్ణయించింది. దీంతో మంత్రులు సైతం ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్న మంత్రికి ఈ రకమైన అనుభవం ఎదురైంది. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: