Success Story: ఐఐటీలో ఉన్నత విద్యకు దూరమైనా.. ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం సాధించిన యువకుడు..

ప్రవీణ్ (ఫైల్)

చాలా మంది ఐఐటీలో సీటు సంపాదిస్తేనే మంచి ఉద్యోగం వస్తుందని గుడ్డిగా నమ్మేవారు లేకపోలేదు. అయితే ఢిల్లీకి చెందిన ప్రవీణ్ శ్రీధర్ అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధం. ఐఐటీ జేఈఈ క్వాలిఫై కాకపోయినా పెద్ద ఉద్యోగం సంపాదించాడు ఈ 27 ఏళ్ల యువకుడు

  • Share this:
బాగా చదవాలి.. ఐఐటీలో(IIT) చదవాలి.. మంచి జీతం(Salary) ఇచ్చే ఉద్యోగం(Job) సాధించాలి.. ప్రస్తుతం ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఆశించే కోరికల జాబితా ఇది. చాలా మంది ఐఐటీలో సీటు సంపాదిస్తేనే మంచి ఉద్యోగం వస్తుందని గుడ్డిగా నమ్మేవారు లేకపోలేదు. అయితే ఢిల్లీకి చెందిన ప్రవీణ్ శ్రీధర్ అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధం. ఐఐటీ జేఈఈ క్వాలిఫై కాకపోయినా పెద్ద ఉద్యోగం సంపాదించాడు ఈ 27 ఏళ్ల యువకుడు. ప్రతిష్టాత్మక బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(BCG)లో అధిక జీతం పొందే ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేరళకు చెందిన ఓ నిరుపేద పూజారి అతడి తండ్రి. ఢిల్లీలో పెరిగిన ప్రవీణ్.. రాజధానిలోనే పాఠశాల విద్యను పూర్తి చేసి కేరళలోని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(CUSAT) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు.

High Court: మగవారికి శుభవార్త.. హైకోర్టు సంచలన తీర్పు.. పూర్తి వివరాలిలా..


రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్‌పై ఆసక్తి.. అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. "నేను జేఈఈకి అర్హత సాధించలేదు. అప్పట్లో నాకు అది పెద్ద ఎదురుదెబ్బగా అనిపించింది. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది పెద్ద విషయమేమి కాదనిపిస్తుంది. ఐఐటీలు, ప్రాచుర్యం పొందిన కళాశాలలో చదవడంలో గొప్ప అనుభవమే. కానీ దీర్ఘకాలంలో కళశాలల కంటే నైపుణ్యాలు ముఖ్యమైనవి" అని ప్రవీణ్ తెలిపాడు.

Vaccine From Sky: డ్రోన్ల సహాయంతో వ్యాక్సిన్ల సరఫరా.. మొదట ఆ జిల్లా నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలివే..


ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత అనేక స్టార్టప్స్ లో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ గా పనిచేశాడు ప్రవీణ్. రోబోటిక్స్, ప్రోగ్రామింగ్‌లో రీసెర్చ్ చేసే సమయంలో మెషిన్ లెర్నింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. "నేను ప్లాక్స్ టెక్ లీడర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో చేరిన వెంటనే, కృత్రిమ మేథస్సు ఎంఎల్ విభిన్న కోణాలను లోతుగా పరిశోధించడానికి ఏడాది పాటు పనిచేయాలనుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రొఫెసర్ల ద్వారా నిర్వహిస్తున్న సాంకేతిక, సాంకేతికేతర కోర్సులపై దృష్టి పెట్టా. స్టాన్ ఫోర్డ్, బర్కిలీ తదితర వర్సీటీల నుంచి నాణ్యత కలిగిన ఉచిత ఆన్ లైన్ ఎంఓఓసీల సహాయంతో స్వయంగా నేర్చుకున్నాను" అని స్పష్టం చేశాడు.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


ఆరు రౌండ్ల ఇంటర్వ్యూను అధిగమించాడు..
బీసీజీలో జాబ్ రావాలంటే రిక్రూట్మెంట్ డ్రైవ్ లో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలని, అనంతరం ఆన్ లైన్ కోడింగ్ టెస్ట్ ఉంటుందని ప్రవీణ్ తెలిపాడు. "మేము డేటా సైన్స్ సంబంధిత సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సి వచ్చింది. క్లియర్ అయిన తర్వాత ప్రధానంగా వ్యాపార సమస్యలకు డేటా సైన్స్ ను వర్తింపజేసే కేస్ స్టడీలతో కూడిన ఆరు రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుంది.

నియామక ప్రక్రియలో బాగా ప్రదర్శన చేయాలంటే సబ్జెక్టులో బలమైన పునాది ఉండాలి. కేస్ స్టడీస్ లో ప్రాక్టీస్ అవసరం. దీర్ఘకాలంలో సీటీఓ స్థాయి పొజిషన్ కు ఎదగాలని కోరుకుంటున్నాను. సమాజానికి తిరిగి ఏదైనా చేయాలని అనుకుంటున్నాను" అని ప్రవీణ్ తన లక్ష్యం గురించి చెప్పాడు.
Published by:Veera Babu
First published: