వ్యక్తి మల రంధ్రం నుంచి చేపను బయటకు తీసిన డాక్టర్లు... ఇదెలా జరిగింది?

డాక్టర్లకు అంతుబట్టని కేసుగా ఇది మారింది. ఇది ఎలా జరిగిందో డాక్టర్లకు అర్థం కావట్లేదు. ఆ చేప మల రంధ్రంలోకి ఎలా వెళ్లిందన్నది మిస్టరీగా మారింది.

news18-telugu
Updated: June 10, 2020, 12:04 PM IST
వ్యక్తి మల రంధ్రం నుంచి చేపను బయటకు తీసిన డాక్టర్లు... ఇదెలా జరిగింది?
వ్యక్తి మల రంధ్రం నుంచి చేపను బయటకు తీసిన డాక్టర్లు... ఇదెలా జరిగింది? (File)
  • Share this:
ఇది జరిగింది... చైనాలో. డాక్టర్ల దగ్గరకు వచ్చిన ఓ 30 ఏళ్ల వ్యక్తి... "సార్... సార్... నాకు కింది నుంచి (మల రంధ్రం నుంచి)" చేప దూరింది. మీరే దాన్ని బయటకు తియ్యాలి. భరించలేకపోతున్నా" అన్నాడు. వేరే ఆపరేషన్ల టెస్టులను పరిశీలిస్తున్న డాక్టర్లు అతను చెప్పింది విని షాక్ అయ్యారు. "వాట్... ఏంటి నువ్వు చెప్పేది... అలా ఎలా వెళ్లింది" అని అడిగారు. "అలా జరిగింది డాక్టర్ సారూ... నేను చూసుకోకుండా చేప మీద కూర్చున్నాను. అది గబుక్కున లోపలికి వెళ్లిపోయింది" అని చెప్పాడు. మళ్లీ డాక్టర్లకు నమ్మశక్యం కాలేదు. ముఖాలు క్వశ్చన్ మార్క్‌లా పెట్టి అతనివైపు అనుమానంగా చూశారు.

జూన్ 3న ఈ ఘటన జరిగింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఝావోక్వింగ్ ఫస్ట్ పీపుల్స్ ఆస్పత్రిలో డాక్టర్లకు ఈ వింత అనుభవం ఎదురైంది. డాక్టర్లు అతనివైపు అదోలా చూస్తుంటే... ఎంతసేపు చూస్తారు సార్... నొప్పి భరించలేకపోతున్నా... త్వరగా ఆపరేషన్ చెయ్యండి సార్... అని బతిమలాడుకున్నాడు. వెంటనే డాక్టర్లు ఎక్సరే తీశారు. మల రంధ్రంలో మొజాంబిక్ తిలాపియా అనే తాగు నీటి చేప ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.

ఆపరేషన్ థియేటర్‌కి అతన్ని తీసుకెళ్తుంటే... నర్స్ అతన్ని అడిగింది... అది ఎలా వెళ్లిందని. మళ్లీ పైన చెప్పిన సమాధానమే చెప్పాడు. వెంటనే నర్సుకు ఒళ్లు మండింది. "నీ కంటికి నేను అమాయకురాలిలా కనిపిస్తున్నానా?" (Do you think I’m an idiot?) అని అడిగింది.

ఆ తర్వాత అతనికి ఎమర్జెన్సీ ఎండోస్కోపీ నిర్వహించారు. కానీ డాక్టర్లు ఆ చనిపోయిన చేపను బయటకు తియ్యలేకపోయారు. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంది. వెంటనే మరో ఆపరేషన్ చెయ్యాలని సర్జన్లు డిసైడయ్యారు. ఇది అరుదైన ఆపరేషన్ కావడంతో... మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అయ్యింది.

సర్జరీ చేసి చేపని బయటకు తీశారు. ఇప్పుడిప్పుడే అతను కోలుకుంటున్నాడు. మొన్ననే ఇండియాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 2 అడుగుల పొడవున్న మొబైల్ ఛార్జర్ ఓ వ్యక్తి మూత్ర నాళంలో ఉంటే బయటకు తీశారు. ఇలాంటి అరుదైన కేసులు డాక్టర్లకు సవాళ్లు విసురుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: June 10, 2020, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading