Home /News /trending /

SOLDIERS AND DEER FRIENDSHIP DURING NAXAL OPERATION IN BASTAR VB

Viral Video: సైనికులతో స్నేహం చేస్తున్న ‘జింక’.. సైనిక ఆపరేషన్ లో కూడా పాల్గొంటుంది.. నమ్మడం లేదా.. మీరే చూడండి..

సైనికుల వెంట వెళ్తున్న జింక

సైనికుల వెంట వెళ్తున్న జింక

Viral Video: బస్తర్ డివిజన్‌లోని సుక్మా జిల్లాలో ఓ జింక సైనికులతో తిరగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియోలో.. జింక సైనికులతో కలిసి అడవిలో గస్తీ తిరుగుతోంది. నక్సలైట్ ఆపరేషన్ సమయంలో కూడా ఆ జింక సైనికులతో నీడలా జీవిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  సాధారణంగా ఎవరైనా ఇంట్లో పిల్లి(Cat), కుక్కలను(Dog) పెంచుకొని వాటిని ఎంతో అపరూపంగా చూసుకుంటారు. దాంతో అవి ఎంతో విశ్వాసంతో ఇంటి ఓనర్(Owner) ఎం చెప్పినా వింటాయి. ఇలా పెంచుకునే జంతువుల విషయంలో ఎవరైనా ప్రేమతో ఉంటారు. అయితే మనం సోషల్ మీడియాలో(Social Media) అప్పుడప్పుడు చాలామంది బయట జంతువులతో ఫొటోలు దిగుతూ.. వాటితో స్నేహంగా ఉండే వీడియోలు కూడా చాలా వరకు చూశాం. అయితే వాళ్లు ఫొటోలు దిగేందుకు మాత్రం దాదాపు జూలో అవకాశం ఉంటుంది. అడవిలో ఆ అవకాశం ఉండదు. క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి ఇలా ప్రయత్నిస్తే.. అంతే ఇక. అవి మనతో ఫొటోలు దిగడం కాదు కదా.. నమిలి తినేస్తాయి కూడా.

  అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


  జూలో(Zoo) మాత్రమే ఇతర జంతువులతో మానవ స్నేహానికి సంబంధించిన చాలా వీడియోలను మనం చూసి ఉంటాం. మనుషులతో కుక్కల విధేయత గురించి మనం వినే ఉంటాం. నక్సల్ ప్రభావిత ప్రాంతంలోని అడవులలో సైనికులతో సెర్చ్ ఆపరేషన్ సమయంలో వాటితో కేవలం ట్రెండ్ డాగ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఓ జింక సైనికులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. నక్సల్ ప్రభావిత ప్రాంతం అయిన బస్తర్‌లో, ఒక జింక సెర్చ్ ఆపరేషన్(Operation) కోసం సైనికులతో కలిసి వెళ్లడం మనం గమనించవచ్చు.

  Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


  అది ఏ మాత్రం భయపడకుండా.. నిర్భయంగా సైనికులతో కలిసి అడవిలో తిరుగుతుంది. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉన్న అడవుల్లో ఓ జింక సైనికులతో కలిసి అంచెలంచెలుగా నడక సాగిస్తున్న దృశ్యాన్ని వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియో బస్తర్ డివిజన్‌లోని సుక్మా జిల్లాలో ఉన్న కిస్టారం క్యాంపులో ని సైనికులు బంధించారు. ఒక జింక శిబిరంలో నివసించే సైనికులతో సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉంది. శిబిరంలోని సైనికులు అడవిలో ఆపరేషన్ కోసం వెళ్లినప్పుడల్లా.. ఈ జింక కూడా వారితో పాటు అటూ ఇటూ వెళ్తుంది.

  Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


  ఆపరేషన్ సమయంలో.. జింక నీడలా వారితో ఉంటుంది. జవాన్లు ఆపరేషన్ ముగించుకుని తిరిగొచ్చేసరికి జింక కూడా వాళ్లతో కలిసి తిరిగి శిబిరానికి వస్తుంది. ఇలా జింక.. జవాన్ల మధ్య స్నేహం గురించిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. క్యాంపులో ఉన్న ఒక యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ ఓ రోజు తామంతా శిబిరంలో ఉన్నప్పుడు మాకు కళ్లెదుట జింక కనిపించిందని.. దీంతో దానిని తాము దగ్గరకు తీసుకొని.. సంరక్షణ ప్రారంభించామన్నారు. దాని తర్వాత ఆ జింక అక్కడ నుంచి వెళ్లకపోగా.. తాము ఎక్కడకు వెళితే అక్కడకు మా వెంట వస్తుందని చెప్పాడు.

  Anchor Sreemukhi: ప్యాంట్ లేకుండా యాంకర్ శ్రీముఖి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..


  ఆ రోజు అది మాతో పాటే కలిసిపోయిందని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని.. ఓ రోజు వచ్చి దానిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టగా.. తర్వాత రోజు మళ్లీ అది మా శిబిరానికి వచ్చిందని అన్నాడు. ఆ రోజు నుంచి అది మాతో పాటే ఉంటుందని పేర్కొన్నాడు. తాము ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే.. అది కూడా మాతో పాటే ఆగుతుందని చెప్పాడు. దానికి తిండి, పానీయాల విషయంలో జవాన్లు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపాడు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Basthar, Trending news, Viral image, VIRAL NEWS

  తదుపరి వార్తలు