అనంత విశ్వం (Space)లో వితలకు కొదువ లేనట్లే.. మన సౌర వ్యవస్థ (Solar System)లోనూ అప్పుడప్పుడూ విపత్తులకూ అవకాశం ఏర్పడుంది. ప్రస్తుతం శక్తిమంతమైన సౌర తుఫాను (Solar Storm) భూమి (Earth)వైపు వేగంగా దూసుకొచ్చింది. అది మంగళవారం నాడే భూవాతావరణాన్ని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ప్రకటించింది..
సౌర తుఫాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీపీఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని నాసా సైంటిస్ట్ డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు.
సౌత తుఫాను వల్ల భూమిపై పలు ప్రాంతాల నుంచి ఆకాశంలో ధ్రువకాంతి (అరోరా) వీక్షించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇవాళ భూమిని తాకబోయే పెద్ద తుపాను తర్వాత మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదముందని నాసా అంచనా వేసింది. ఈ నెల 20, 21న జి1–క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది.
సౌర తుఫాను అంటే.. సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. సూర్యమండలపు ఉపరితలం నుండి వచ్చే అయస్కాంత తరంగాలు భూమిని తాకడం చాలా అరుదు. అయితే ఈసారి ఏర్పడింది పెద్దది కావడంతో మనకూ ఎఫెక్ట్ ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.