ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం రేపు (ఏప్రిల్ 30) సంభవించనుంది. ఈ ఖగోళ సంఘటన ఈ నెల రెండో అమావాస్య రోజే ఏర్పడనుంది. దీన్ని బ్లాక్ మూన్(Black Moon) అని కూడా పిలుస్తారు. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు(Moon) అడ్డుగా వచ్చినప్పుడు భూ గ్రహం మీద నీడ పడినప్పుడు సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. ఈ ఏడాది చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా అడ్డుకోవడంతో పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది. NASA ప్రకారం..సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలోని(South America) కొన్ని ప్రాంతాలతో పాటు చిలీ(Chile), అర్జెంటీనా, ఉరుగ్వేలో ఎక్కువ భాగం, పశ్చిమ పరాగ్వే, నైరుతి బొలీవియా, ఆగ్నేయ పెరూ(Peru), నైరుతి బ్రెజిల్‌లోని(Brezil) కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంటార్కిటికా, పసిఫిక్(Pacific), అట్లాంటిక్ మహాసముద్రాలలో కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. బ్లాక్ మూన్‌ను వీక్షించలేని వారు భారతదేశానికి చెందిన అంతరిక్ష యూట్యూబ్ ఛానెల్ గ్యాన్ కి గరీబీ ద్వారా ఖగోళ దృశ్యం ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. పాక్షిక సూర్యగ్రహణం ఏప్రిల్ 30న మధ్యాహ్నం12:15 గంటలకు కనిపిస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున 2:11 గంటలకు కనిపిస్తుంది. ఉదయం 4:07 గంటలకు గ్రహణం ముగుస్తుంది.
* సూర్యగ్రహణం అంటే..?
సూర్యుడు - భూమి మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు, భూమిపై దాని నీడలు పడతాయి. ఈ ఘటనను సూర్యగ్రహణం అంటారు. అయితే చంద్రుడు సూర్యుని డిస్క్‌లో కొంత భాగాన్ని మాత్రమే అడ్డుకున్నప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. నాసా ప్రకారం... రేపు సంభవించే గ్రహణం ద్వారా 65% సూర్యుడిని అడ్డుకుంటుంది.
* బ్లాక్ మూన్ అంటే ఏంటి?
బ్లడ్ మూన్, బ్లూ మూన్ లాగా, బ్లాక్ మూన్ మూలానికి స్పష్టమైన నిర్వచనం అంటూ ఏదీ లేదు. పాత రైతు పంచాంగం ప్రతి అమావాస్య బ్లాక్ మూన్ అని సూచిస్తుంది. ఎందుకంటే ప్రతి అమావాస్య రోజున, చంద్రుడు చీకటి లేదా నలుపు మాత్రమే భూమి నుండి కనిపిస్తుంది. బ్లాక్ మూన్లను చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి 32 నెలలకు, అంటే ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి అవి సంభవిస్తాయి.
Dream meaning: మీరు కలలో ఈ జీవిని చూశారా? అది మీరు తప్పక ధనవంతులవుతారనే సంకేతమేనట...
సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు. పాక్షిక సూర్యగ్రహణమైతే.. సూర్యునికి భూమికి సరిగ్గా మధ్యలో చంద్రుడి స్థితి ఉండదు. దాంతో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోడు. ఇది పూర్తిగా చంద్రుడు సూర్యుడిని ఎంతభాగం కవర్ చేశాడనేదానిపై ఆధారపడి ఉంటుంది. అదే సంపూర్ణ సూర్యగ్రహణమైతే.. సూర్యుడు, చంద్రుడు, భూమి..మూడూ సమాంతర రేఖపై ఉంటాయి.
సూర్యగ్రహణం సంపూర్ణంగా లేదా పాక్షికంగా ఉన్నా.. నేరుగా సూర్యుడిని చూడకూడదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సోలార్ ఫిల్టర్ పరికరాలతో చూడవచ్చని నాసా తెలిపింది. పాక్షిక సూర్యగ్రహణం వీక్షించేటప్పుడు ప్రత్యేకమైన కళ్లజోడు ధరించాలి. ఇవి రెగ్యులర్ కళ్లజోడుకు భిన్నంగా ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో అవి లేకపోతే.. పిన్ హోల్ ప్రొజెక్టర్ ద్వారా చూడవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NASA, Solar Eclipse, Solar Eclipse 2021, South america