వచ్చే వారమే సూర్యగ్రహణం... మిస్సవకండే..

Solar Eclipse 2019 : వర్షం, వడగండ్లు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వంటివి మనం కోరుకున్నప్పుడు రావు. అందువల్ల అవి వచ్చినప్పుడు వాటిని చూసేయాలి. ఏమంటారు.

news18-telugu
Updated: December 22, 2019, 12:19 PM IST
వచ్చే వారమే సూర్యగ్రహణం... మిస్సవకండే..
సూర్యగ్రహణం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Solar Eclipse 2019 : సూర్య, చంద్ర గ్రహణాలు మన దేశంలో పూర్తి స్థాయిలో కనిపించే సందర్భాలు తక్కువ. ఈ ఏడాది ముగిసిపోతున్న తరుణంలో చివరి పంచ్ అదిరిపోవాలి అన్నట్లుగా... సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతోంది. దీన్ని "రింగ్ ఆఫ్ ఫైర్" అంటున్నారు. ఎందుకంటే... సూర్యుడికీ, భూమికీ మధ్య చందమామ అడ్డు వచ్చినప్పుడు... సూర్యుడు మనకు కనిపించకుండా పోతాడు. ఆ సమయంలో... సూర్యుడికి అడ్డుగా చీకటిగా ఉండే చందమామ చుట్టూ... సూర్య జ్వాలలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తూర్పు దేశాల్లో కనిపిస్తుంది. అంటే... మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. మనతోపాటూ సౌదీ అరేబియా, సుమత్రా, మలేసియా, ఒమన్, సింగపూర్, ఉత్తర మారినా ఐలాండ్స్, శ్రీలంక, బోర్నియా ప్రజలు కూడా దీన్ని చూడగలరు. ఇంతకీ ఎప్పుడో చెప్పలేదు కదూ. డిసెంబర్ 26న (గురువారం) ఉదయం 8.04కి మొదలవుతుంది. అది అద్భుతంగా కొనసాగి ఉదయం 9.24కి పీక్ స్టేజ్‌కి చేరుకుంటుంది. సరిగ్గా 9.26కి మనకు చీకటి అలుముకుంటుంది. అంటే పగలే మనం రాత్రిని చూస్తాం. ఆ సమయంలో... సూర్యుడికి సరిగ్గా మధ్యలోకి చందమామ వెళ్తుంది. అప్పుడే మనం రింగ్ ఆఫ్ ఫైర్ చూస్తాం. ఆ తర్వాత 9.27కి మళ్లీ చందమామ సూర్యుడి నుంచీ పక్కకు జరగడం మొదలవుతుంది. ఉదయం 11.05కి పూర్తిగా సూర్యగ్రహణం ముగుస్తుంది. జనరల్‌గా గ్రహణం మొదలయ్యే టైంలో ప్రజలంతా... ఆఫీసులు, ఉద్యోగాలకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. అయినప్పటికీ ఇదో రోదసీ అద్భుతం కాబట్టి... ఎన్ని పనులున్నా పక్కన పెట్టి... ఈ ఇయర్‌లో చివరి పంచ్‌ని చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే. దీన్ని డైరెక్టుగా కళ్లతో చూడకూడదు కదా. సో... సన్ గ్లాసెస్ రెడీ చేసుకోండి మరి.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు