వాళ్లంతా లక్షలు సంపాదించే జీతగాళ్లు. కారులో కూర్చొని దర్జాగా ఇంటి నుంచి ఆఫీసుకు.. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు. చెమట కూడా పట్టకుండా హాయిగా జీవితం గడిపేసేంత స్థోమత ఉంది వాళ్లకు. కానీ, ఇదేమీ జీవితం అనుకున్నారు. సమాజానికి తమ వంతు సహాయం చేయాలని నడుం బిగించారు. 15 మందితో ఒక బృందంగా ఏర్పడి సమాజ సేవలోకి దిగారు. ఆ బృందం పేరే.. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్స్ ట్రాఫిక్ ఫోరం. చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించే క్రమంలో వారికి కనిపించిన అతిపెద్ద సమస్య.. ట్రాఫిక్. ట్రాఫిక్‌ను నియంత్రిస్తే హైదరాబాద్ నగరంలో సగం సమస్య తీరినట్టేననుకొన్నారు.
తమ ఆలోచనను ట్రాఫిక్ అధికారులతో పంచుకోగా.. వారి నుంచి సహకారం అందింది. ఇంకేముంది ట్రాఫిక్ రూల్స్ గురించి చెబుతూనే, వాహనాల రద్దీని నియంత్రిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక వెబ్‌సైట్ www.cyberabadsecuritycouncil.org ఏర్పాటు చేసి తమ విజన్‌ను తెలియజేస్తున్నారు. ట్రాఫిక్ ఒక్కటే కాదు.. మహిళలకు రక్షణ, మెడికల్ ఎమర్జెన్సీ ట్రైనింగ్ సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, TRAFFIC AWARENESS