ఫేస్‌బుక్‌కి రూ.34వేల కోట్ల ఫైన్... చేసిన తప్పుకి అలా 'బుక్' అయ్యింది...

Facebook : ఫేస్‌బుక్‌లో మన డేటా సేఫ్‌గా ఉంటుందా... అంటే... 99 శాతం మంది ఉండదనే అంటున్నారు. డేటా ప్రైవసీ విషయంలో చేసిన తప్పుల వల్ల ఫేస్‌బుక్ ఇప్పుడు రూ.34 వేల కోట్ల జరిమానా కట్టాల్సి వస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 7:00 AM IST
ఫేస్‌బుక్‌కి రూ.34వేల కోట్ల ఫైన్... చేసిన తప్పుకి అలా 'బుక్' అయ్యింది...
మార్క్ జుకెర్‌బర్క్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 7:00 AM IST
ఒకప్పుడు ఎంతో మంచి పేరున్న ఫేస్‌బుక్ ఇప్పుడు వరుస కంప్లైంట్లు, విమర్శలతో సతమతమవుతోంది. ఆమధ్య పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా 8కోట్ల 7లక్షల ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని అక్రమంగా సంపాదించిందనే ఆరోపణలు రావడంతో... ఆ తప్పిదానికి బాధ్యతగా... ఫేస్‌బుక్ రూ.34వేల కోట్ల ఫైన్ చెల్లించాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. ఈ కేసుపై 2018 మార్చి నుంచీ దర్యాప్తు జరుగుతోంది. నిజానికి యూజర్ల డేటాను ఫేస్‌బుక్ ఎవరికీ ఇవ్వకూడదు. అందుకు సంబంధించి 2011లో రూల్స్ ఉన్నాయి. ఫేస్ బుక్ మాత్రం ఆ డేటాను... కేంబ్రిడ్జ్ అనలిటికాకు ఇచ్చింది. అలా యూజర్ల కొంపముంచింది.

ఫేస్‌బుక్‌పై ఫైన్ వెయ్యడానికి ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కి అర్హత లేదన్న వాదన వినిపిస్తోంది. దీనిపై అమెరికా న్యాయ శాఖ పౌర విభాగం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ పౌర విభాగం ఓకే చేస్తే... ఒక సోషల్ మీడియా సంస్థపై FTC వేసిన అతి పెద్ద ఫైన్ ఇదే అవుతుంది.

2016లో జరిగిందీ స్కాం. కేంబ్రిడ్జ్ అనలిటికా అనే బ్రిటన్ సంస్థ... ఫేస్‌బుక్ యూజర్ల డేటాను తీసుకొని... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ గెలిచేందుకు వీలుగా ఆ డేటాను ఉపయోగించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అమెరికా, బ్రిటన్‌లో దర్యాప్తు జరిగింది.


2018 అక్టోబర్‌లో తమ దేశ పౌరుల డేటాను అమ్మినందుకు బ్రిటన్‌లో ఓ సంస్థ... ఫేస్‌బుక్‌పై రూ.4,30,96,901 ఫైన్ వేసింది. ఇప్పుడు మరో ఫైన్ పడటంతో... ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ షాకవుతోంది. జరిమానా నుంచీ ఎలా తప్పించుకోవాలి అనేదానిపై న్యాయప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది.
First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...