Healthcare Workers Dance: పీపీఈ కిట్లతో హెల్త్​ కేర్​ సిబ్బంది డ్యాన్స్.. వీడియో వైరల్..!

వైరల్ అయిన డ్యాన్స్ వీడియో

కరోనా సోకిన రోగులను ఉత్సాహపరిచేందుకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పీపీఈ కిట్లను ధరించి భాంగ్రా స్టెప్పులేయడం మనం చూడవచ్చు. వైద్యులు డాన్స్​ చేస్తూనే.. రోగులను కూడా వారితో పాటు డాన్స్​ చేయాలని ప్రోత్సహించారు. దీంతో కొంతమంది రోగులు బెడ్​పైనే...

  • Share this:
దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా భారత్​లో రోజుకు 3.5 లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. దీంతో, ఏ హాస్పిటల్​ చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. దీంతో వైద్య సిబ్బంది, అంబులెన్స్​ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా కట్టడిలో ముందున్న వారంతా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు 24 గంటలు హాస్పిటల్​లోనే ఉండి సేవలందిస్తున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒత్తిడి పోగొట్టుకోవడానికి, పేషెంట్లలో మనో స్థైర్యాన్ని నింపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు రిలాక్స్​ అయ్యేందుకు డ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా హెల్త్​ వర్కర్లు పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్​గా మారింది.

కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సేవలు అందించే సిబ్బందికి సెలవులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఒత్తిడిని దూరం చేసేందుకు, పేషెంట్లలో ధైర్యాన్ని నిపేందుకు వైద్య సిబ్బంది డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కరోనా రోగుల్లో సానుకూల ఆలోచనలు నింపుతాయని వారు చెబుతున్నారు. తాజా వీడియో ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారుతోంది. హెల్త్ వర్కర్లు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.



సోషల్​ మీడియాలో వైరల్​..
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. కరోనా సోకిన రోగులను ఉత్సాహపరిచేందుకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పీపీఈ కిట్లను ధరించి భాంగ్రా స్టెప్పులేయడం మనం చూడవచ్చు. వైద్యులు డాన్స్​ చేస్తూనే.. రోగులను కూడా వారితో పాటు డాన్స్​ చేయాలని ప్రోత్సహించారు. దీంతో కొంతమంది రోగులు బెడ్​పైనే చిటికెలు, చప్పట్లు కొట్టడుతూ భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. ఈ వీడియోను గుర్మీత్ చాధా అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్లేబ్యాక్ సింగర్, గేయ రచయిత షారీ మన్ పాడిన జిందగీ అనే పంజాబీ సాంగ్​కు వారు డ్యాన్స్ చేశారని తెలిపారు. సోషల్ మీడియా యూజర్లు ఇంటర్​నెట్​లో ఈ వీడియోను చూసిన తరువాత వైద్యులను మరింతగా ఉత్సాహపరిచారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సానుకూల భావాలను పెంపొందిస్తున్న హెల్త్​ వర్కర్ల​ను ప్రశంసిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published: