హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కొత్త ట్రాఫిక్ జరిమానాల ఎఫెక్ట్.. సర్కారుకూ ఫైన్ వేస్తున్న నెటిజన్లు..

కొత్త ట్రాఫిక్ జరిమానాల ఎఫెక్ట్.. సర్కారుకూ ఫైన్ వేస్తున్న నెటిజన్లు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

New Traffic Rules: ట్రాఫిక్ క్రమబద్ధం చేయకుండానే, రోడ్లు సరిగా వేయకుండానే వేలకు వేల ఫైన్లు ఎలా విధిస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రభుత్వం తన పనిని సక్రమంగా నిర్వహించాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నూతన మోటార్ వెహికల్ చట్టంతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల్ని కంగు తినిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేలకు వేల జరిమానా పడుతుండటంతో వాహనదారుల గుండెలు గుబేల్‌‌మంటున్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోయినా, సిగ్నల్ పడ్డాక క్రాసింగ్ లైన్ దాటినా ఠక్కున ఛలానా వచ్చేస్తోంది. అయితే, ట్రాఫిక్ క్రమబద్ధం చేయకుండానే, రోడ్లు సరిగా వేయకుండానే వేలకు వేల ఫైన్లు ఎలా విధిస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రభుత్వం తన పనిని సక్రమంగా నిర్వహించాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు ఏకంగా సర్కారుకు, ప్రభుత్వాధికారులకు ఫైన్లు వేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.


రోడ్లపైన గుంతలు పడితే రూ.5 లక్షలు, సిగ్నల్స్ వెలగకపోతే రూ.10 లక్షలు, పోలీసులు హెల్మెట్ పెట్టుకోకపోతే రూ.5 లక్షలు, ఎస్సై లేకుండా బైక్ ఆపితే రూ.10 లక్షలు, యూటర్న్ ఆపేసి రోడ్లు బ్లాక్ చేస్తే రూ.15 లక్షలు, రోడ్లపైన క్రాసింగ్ గీతలు చెరిగితే రూ.15 లక్షలు, వాహనదారులకు సీఎం కాన్వాయ్ ఇబ్బంది కలిగిస్తే రూ.20 లక్షలు, పోలీసులు లంచం అడిగితే రూ.50 లక్షలతో పాటు 5 సంవత్సరాల జైలు శిక్ష వేయాలంటూ నెటిజన్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న పోస్ట్

First published:

Tags: Police, Traffic, Traffic rules

ఉత్తమ కథలు