Home /News /trending /

SOCIAL MEDIA FOLLOWERS WHO HELPED SAVE MONEY AT THE REQUEST OF THE WIFE OF A ZOMATO EMPLOYEE WHO DIED IN A ROAD ACCIDENT SNR

ఆమె విజ్ఞప్తి..వేలాది హృదయాల్ని కదిలించింది..ఇంతకి ఆమె ఏం చేసింది..?

Photo Credit :Twitter

Photo Credit :Twitter

Humanity: భర్తను కోల్పోయాను.. న్యాయం చేయమని కోరిన ఆ మహిళకు సోషల్ మీడియా ద్వారా చాలా మంది స్పందించారు. ఆమెకు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. ఆమె కష్టాలు తీరే మార్గం చూపించి పుణ్యం కట్టుకున్నారు.

ఆత్మీయులను కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే వారి కంటే సాయం చేసే వాళ్లే దేవుళ్లులా కనిపిస్తారు. సాయం చేసి ఆదుకోమని ఓ మహిళ సోషల్ మీడియా వేదిక ద్వారా కోరడంతో చాలా మంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఢిల్లీ (Delhi)లో రోహిణి(Rohini)ప్రాంతంలో జొమాటో డెలవరీ ఎగ్జిక్యూటివ్(Zomato delivery executive)సలీల్‌ త్రిపాఠీ(Salil tripathi)అనే వ్యక్తి పోలీస్‌ వాహనం(Police vehicle)ఢీకొని చనిపోయాడు. ఈఘటన తర్వాత అతని కుటుంబం కుటుంబ పెద్ద లేక దిక్కులేనిదైంది. దీంతో అతని భార్య సుచేత(Suchetha)తమకు న్యాయం చేయమని సోషల్ మీడియా(Social media)ద్వారా విజ్ఞప్తి చేసింది. ఆమె భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తికి చాలా మంది స్పందించారు. ఎవరికి తోచిన ఆర్ధిక సాయాన్ని సుచేత బ్యాంక్‌ అకౌంట్‌(Bank account)కి ట్రాన్స్‌ఫర్ (Money transfer)చేశారు. ఇలా సోషల్‌ మీడియా ద్వారా మొత్తం నగదు 9లక్షలు9 lakhs జమా అయ్యాయి. తన గోడు ఆలకించి సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సుచేత. సలీల్ త్రిపాఠి ఫ్యామిలీ కష్టాల్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న జొమాటో సీఈవో (Zomato ceo)దీపేందర్‌ గోయల్ (Deepinder goyal)వెంటనే ట్విట్టర్ (Twitter)ద్వారా సంతాపం తెలియజేశారు. సలీల్‌ కుటుంబానికి 10లక్షల బీమా మంజూరు చేయడంతో పాటు సుచేతకు అర్హతతో కూడిన ఉద్యోగాన్ని అందజేస్తామని ప్రకటించారు.

విజ్ఞప్తికి వచ్చిన స్పందన ..
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యూయేషన్ చేసిన సలీల్‌..రెస్టారెంట్‌ మేనేజర్‌గా దాదాపు 15ఏళ్లు పనిచేశాడు. కరోనా కష్టకాలంలో అతని ఉద్యోగం పోవడంతో ఇలా జొమాటో డెలవరీ ఎగ్జిక్యూటివ్‌గా చేరి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో రూపంలో సలీల్‌ దూరమైనప్పటికి 10ఏళ్ల కొడుకుని ఎలా పోషించుకోవాలని సుచేత సోషల్ మీడియా ద్వారా తన బాధను వెలిబుచ్చింది. జైల్ సింగ్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్ చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే తన భర్తను కోల్పోయానని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరడంతో స్పందన మరో విధంగా వచ్చింది. ఏది ఏమైతేనేం సుచేత విజ్ఞప్తి చాలా హృదయాలను కదిలించింది. తమలో ఉన్న మానవత్వాన్ని చాటుకునేలా చేసింది.

ఆ కుటుంబానికి అన్నీ విధాలుగా..
జొమాటోలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం సుచేత కుటుంబానికి తమ వంతు సాయం అందజేశారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి మరో 12లక్షల విరాళాల్ని సేకరించి కష్టాల్లో ఉన్న సుచేతకు అందజేయాలని నిర్ణయించారు. సాటి ఉద్యోగి ఇబ్బందులను గ్రహించి తోచిన సాయం చేసేందుకు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ముందుకు రావడం హర్షనీయమని జొమాటో సీఈవో దీపేందర్‌ గోయల్ తన ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. సలీల్‌ త్రిపాఠి కుటుంబానికి ఆర్ధిక సాయమే కాదు..అతని 10ఏళ్ల కుమారుడు చదువుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని జొమాటో సీఈవో పేర్కొన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Financial support, Social medai, Zomato

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు