చైనాలో కొరొనా వైరస్‌ పుట్టుకకి కారణం పాములేనా? సంచలన పరిశోధన...

China Coronavirus outbreak : ఓ కొత్త వైరస్ పుట్టుకొచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియాలి. లేదంటే... దాన్ని అడ్డుకోవడం కష్టం. చైనాలో వచ్చిన కొరొనా వైరస్... పాముల వల్ల వచ్చిందంటున్నారు ఆ విషయాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 23, 2020, 12:42 PM IST
చైనాలో కొరొనా వైరస్‌ పుట్టుకకి కారణం పాములేనా? సంచలన పరిశోధన...
చైనాలో కొరొనా వైరస్‌ పుట్టుకకి కారణం పాములేనా? సంచలన పరిశోధన... (File)
  • Share this:
చైనాలోని క్రైట్ (Krait), కోబ్రా (Cobra) పాముల వల్ల కొత్తగా పుట్టిన కొరొనా వైరస్ వ్యాపించి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. క్రైట్ పాములు అత్యంత విషపూరితమైనవి. ఈ చలికాలంలో వ్యాపించిన ఈ వైరస్ వల్ల... ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చి... ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. మధ్య చైనాలోని వుహాన్ నగరంలో ఈ వైరస్‌ని గతేడాది డిసెంబర్‌లో తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇటీవలే అమెరికాలో కూడా కొరొనా వైరస్ వ్యాపించినట్లు తెలిసింది. ఇలాంటి వైరస్సే... పశ్చిమాసియా దేశాల్లో గత 17 ఏళ్లుగా కనిపిస్తోంది. దాని వల్ల వందల మంది చనిపోయారు కూడా. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)... దీనికి కొరొనా వైరస్ అనే పేరు పెట్టింది.
కొరొనా వైరస్... తలపై పెట్టే కిరీటం ఆకారంలో ఉంటుంది. ఇంగ్లీష్‌లో కిరీటాన్ని క్రౌన్ అంటారు కదా. ఆ విధంగా ఈ వైరస్‌కి కొరొనా వైరస్ అని పేరు పెట్టింది WHO. ఇది గాల్లో ఎగురుతూ వెళ్లే వైరస్. ఇది జంతువులు, పక్షుల ఊపిరితిత్తులు, పొట్టలో తిష్ట వేస్తోంది. అలాంటిదే ఇప్పుడు మనుషులకు కూడా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన మందు లేదు. ఎందుకంటే అసలు ఈ వైరస్‌ని ఎలా తరిమికొట్టాలో తెలియట్లేదు. అది తెలిస్తేనే... అలాంటి మందులు తయారుచెయ్యగలరు. అందువల్ల అసలీ వైరస్ రాకుండా చూసుకోవడం ముఖ్యం.

ప్రస్తుతం ఈ వైరస్... మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వుహాన్‌లోని సముద్ర మాంసం అమ్మే మార్కెట్ నుంచీ ఈ కొత్త వైరస్ ప్రారంభమైంది. ఆ మార్కెట్‌ని ఇప్పుడు క్లోజ్ చేశారు. ఐతే... అక్కడకు వైరస్ ఎలా వచ్చిందో పరిశోధించారు. క్రైట్, కోబ్రా పాముల్లో సరిగ్గా ఇలాంటి వైరస్సే ఉండటాన్ని గమనించారు. అందువల్ల వాటి నుంచే అది మనుషులకు వ్యాపించి ఉండొచ్చనే అంచనా ఉంది. ఇండియాలో మనం జాగ్రత్త పడాలి. వీలైనంతవరకూ సూర్యరశ్మిని గ్రహించాలి. తద్వారా ఇలాంటి వైరస్‌ల బారి నుంచీ తప్పించుకునే ఛాన్స్ ఉంది.
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు