HOME » NEWS » trending » SNAKE RESCUERS HAD A NARROW ESCAPE WHILE TRYING TO RESCUE A KING COBRA IN KARNATAKA VIRAL VIDEO KRS

Viral Video: అమ్మో.. కాపాడబోతే మీదకు ఎగిరిన King Cobra.. ఆ తర్వాత

కింగ్ కోబ్రా (పెద్ద తాచుపాము)ను ఇద్దరు పాములను కాపాడే వారు రక్షించారు. అయితే అది ఆ తర్వాత వారిపైనే తిరగబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.  

news18-telugu
Updated: January 12, 2021, 4:37 PM IST
Viral Video: అమ్మో.. కాపాడబోతే మీదకు ఎగిరిన King Cobra.. ఆ తర్వాత
Twitter image
  • Share this:
చెరువు గట్టుపై చెట్టు వేర్లలో చిక్కుకొని ఓ భారీ తాచుపాము (King Cobra) విలవిల్లాడింది. దానిని విడిపించేందుకు ఇద్దరు పాములు పట్టేవారు సిద్ధమయ్యారు. చూసేందుకు భయంకరంగా ఉన్నా దాన్ని రక్షించాలనుకున్నారు.

ఓ కర్ర సాయంతో చిక్కుకున్న పాము తలను విడిపించారు. అయితే వెంటనే తేరుకున్న ఆ భారీ పాము వారిపైకి వచ్చింది. కాటేసేందుకు మీదకు మీదకు ఎగిరింది. భయంకరంగా ఉన్న పాము ఒక్కసారి పడగ విప్పగానే వారు భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి దాన్ని చేత్తోనే కొట్టాడు. ఇంతలోగా రెండో వ్యక్తి వచ్చి దాన్ని అదుపు చేశాడు. దీంతో కాస్తలో వారి ప్రాణాలు దక్కాయి. ఒకవేళ కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రాణాల మీదకు వచ్చేది.

కర్ణాటక శివమొగ్గ జిల్లా మట్టికట్టలో ఈ ఘటన జరిగింది. మొత్తంగా దాన్ని పట్టుకున్న వారు మళ్లీ అడవిలో సురక్షితంగా వదిలేశారు. దీంతో అంతా క్షేమంగానే జరిగింది.


ఈ వీడియోను అమిత్ ఉపాధ్యే అనే రచయిత ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్​గా మారింది. కామెంట్లు కూడా భారీనే వస్తున్నాయి. ఆ పామును చూసేందుంకే భయంకరంగా ఉందని, అది చాలా కోపంగా ఉన్నట్టుందని నెటిజన్లు స్పందిస్తున్నారు.

Kudos must go to both these guys, especially the man who was a little away from the king, instead of saving himself from the bite, he jumped over the cobra to save his friend. Well done 👏🏻👏🏻

“జీవాలను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి సలాం చేస్తున్నా. ఇలాంటి వారికి మరింత గుర్తింపు రావాలి. హీరోస్​” అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. కాగా దూరంగా ఉన్న వ్యక్తి భయపడి తన ప్రాణం కోసం చూసుకోకండా.. స్నేహితుడి కోసం కోబ్రా మీద పడ్డాడని, వెల్​డన్ అని మరో వ్యక్తి స్పందించాడు. ఇలా ఈ వీడియికు కామెంట్ల వర్షం కురుస్తోంది.
Published by: Krishna P
First published: January 12, 2021, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading