పాములను (Snakes) కాపాడే వీడియోలు ఎప్పుడూ ఉత్కంఠగా ఉంటాయి. ప్రమాదకరమైన స్నేక్‌లను పట్టుకోవడం కాస్త రిస్కే. అయితే పాములను కాపాడేవారు, జంతు ప్రేమికులు.. కష్టాల్లో ఉన్న వాటిని రక్షిస్తారు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. బావిలో పడి ఇబ్బందులు పడుతున్న పామును కొందరు యువకులు సాహసోపేతంగా రక్షించారు.
బావిలో పడిన పామును ఓ టెక్నిక్‌తో యువకులు కాపాడారు. ఓ వ్యక్తి బావిలోకి దూకితే.. మరొకరు మెట్లలో బావి గోడకు ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీల సాయంతో నీటి సమీపంలో నిలబడ్డారు. నీటిలో ఈత కొడుతున్న పామును కడ్డీతో పట్టేసేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం ఓ వ్యక్తి నీటిలో దూకి.. కడ్డీ పట్టుకొని ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లేలా పాము దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. పాము తన వైపునకు దూసుకొస్తున్నా.. ఎంతో నేర్పుతో నీటిని చల్లుతూ పాముకు దారి చూపారు. కాసేపటికి ఇనుర చువ్వలపై నిల్చున్న వ్యక్తిని పాము సమీపించింది. దీంతో అతడు దాన్ని కడ్డీతో పట్టుకొని జాగ్రత్తగా బావి ఒడ్డుపైకి తీసుకెళ్లారు. తర్వాత ఆ పామును ఓ ప్లాస్టిక్ బాటిల్లో భద్రపరిచారు. ఆ తర్వాత దాన్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేశారు.
పామును సాహసోపేతంగా కాపాడిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లోనే ఈ వీడియోకు ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఎంతో జాలితో పామును రక్షించాలని వారిని అభినందిస్తున్నారు. అయితే ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడం సరికాదని మరికొందరు సలహా ఇచ్చారు.
మరోచోట నీళ్లు లేని గుంతలో పడిన పామును కాపాడిన పూర్తి వీడియో సైతం క్షణక్షణం ఉత్కంఠ కలిగించేలా ఉంది.
బుసలు కొడుతున్న పామును చివరికి ఓ బ్యాగులో పట్టేశారు.