హైదరాబాద్ మెట్రో రైల్లో స్నేక్.. పట్టుకోవడానికి 5 రోజులు పట్టింది..

Hyderabad Metro : స్నేక్ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారని.. ఇక ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడబోమని.. అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: August 20, 2019, 4:48 PM IST
హైదరాబాద్ మెట్రో రైల్లో స్నేక్.. పట్టుకోవడానికి 5 రోజులు పట్టింది..
హైదరాబాద్ మెట్రో రైల్లో పట్టుబడిన పాము
  • Share this:
హైదరాబాద్‌లోని మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలోని మెట్రో రైలులో ఈ నెల 14న ఓ పాము కలకలం రేపింది. రైల్లో పాము కనిపించడంతో ప్రయాణికులు కంగారెత్తిపోయారు. దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ సిబ్బందికి దీనిపై ఫిర్యాదు చేశారు. దాంతో రైలును ఎల్బీనగర్‌లో నిలిపివేశారు.అప్పటినుంచి పాము కోసం రైల్లో తనిఖీలు చేస్తూ ఉండగా... ఐదు రోజుల తర్వాత ఎట్టకేలకు పామును పట్టుకోగలిగారు.

స్నేక్ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారని.. ఇక ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడబోమని.. అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. పాము రైలు ఇంజన్‌లో దాక్కుని ఉండవచ్చునని.. అందుకే ఐదు రోజులకు గానీ పట్టుబడలేదని చెప్పారు. సాధారణంగా రైళ్లలోకి పాములు దూరవని.. అయితే కొన్నిరకాల పాములు ఎత్తుగా ఉండే ప్రదేశాలకు ఎక్కేందుకు ప్రయత్నిస్తాయని.. ఈ పాము కూడా అలాగే దూరి ఉండవచ్చునని చెబుతున్నారు.
First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading