హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: ఇదేంది భయ్యా.. కాటేసిన పాముని బలవంతంగా పట్టుకుని మరీ..

OMG: ఇదేంది భయ్యా.. కాటేసిన పాముని బలవంతంగా పట్టుకుని మరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bihar: వ్యక్తి పోలంలో పనులు చేసుకుంటున్నాడు. ఇంతలో అతనికి ఒక పాము కాటేసింది. అతను ఏమాత్రం భయపడలేదు. ప్రశాంతంగా ఆలోచించి, తనను కాటువేసిన పాముని పట్టుకున్నాడు.

పాములంటే చాలా మందికి చచ్చేంత భయం. అసలు చాలా మంది పాముల పేర్లు ఎత్తడానికి కూడా ధైర్యం చేయరు. పొరపాటున పాము కన్పిస్తే.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసం చేయరు. పాములు (Snake) కొన్నిసార్లు ఆహారం కోసం దారితప్పి, మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. కొన్నిసార్లు.. మనిషి కంట పడతాయి. ఈ క్రమంలో కొందరు పాములను చంపేస్తారు.

మరికొంత మంది మాత్రం పాములను రెస్క్యూ చేస్తారు. అయితే.. కొన్నిసార్లు.. మనిషి పాము కాటుకు కూడా గురవుతుంటాడు. ఇప్పటికే పొలాల్లో, ఇళ్లల్లో వ్యక్తులు పాము కాటుకు గురైన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. కొందరు కాటు వేసిన పాముని, డబ్బాలో వేసుకుని మరీ డాక్టర్ ల వద్దకు వెళ్లిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. బీహార్ లోని (Bihar)  షరీఫ్ జిల్లాలో వింత సంఘటన జరిగింది. కొరై గ్రామంలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సురేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి.. తన పొలంలో పనులకు వెళ్లాడు. అప్పుడు ఒక పాము అతడిని కాటు వేసింది. (Snake bite)  అతను .. ఏమాత్రం టెన్షన్ పడకుండా కాటు వేసిన పాముని బలవంతంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లాడు. తెల్లారగానే డాక్టర్ దగ్గరకు వెళ్దామనిచెప్పి పాముని ఒక డబ్బాలో వేశాడు. రాత్రి అతడికి ఊపిరి పీల్చుకొవడానికి ఇబ్బందిగా మారడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాడు.

ఆ తర్వాత.. వైద్యులు ఏ పాము కరిచిందనగానే.. పామును డబ్బాలో నుంచి బైటకు తీశాడు. అప్పుడు పామును చూసిన వైద్యులు తలోదిక్కుకు పరుగులు పెట్టారు. ఆ తర్వాత.. కొందరు దగ్గరకు వచ్చి.. పాము కాటుకు సరైన విరుగుడు మందును అతనికి ఇచ్చారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా  (viral news)  మారింది.

ఇదిలా ఉండగా గోవాలో ఘోర ప్రమాదం  జరిగింది.

గోవాలో (Goa)  జరిగింది. రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్‌టేక్ చేసేందుకు ఎస్‌యూవీ ప్రయత్నించగా, వంతెన రెయిలింగ్‌లను ఢీకొని నదిలోకి దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున గోవాలోని జువారీ వంతెనపై నుండి కారు స్కిడ్ అయి జువారీ నదిలోకి పడిపోయింది.

దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భారతీయ నావికాదళానికి చెందిన డైవర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. మీడియా నివేదికల ప్రకారం, రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్‌టేక్ చేయడానికి SUV ప్రయత్నించింది. అది వంతెన రెయిలింగ్‌లను ఢీకొని నదిలోకి పడిపోయింది.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, వాహనంలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారని, దానిని ఒక మహిళ నడుపుతోందన్నారు. "గోవా పోలీసులు కోస్ట్ గార్డ్ నౌక, బార్జ్‌లు, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందితో కలిసి వాహనాన్ని గుర్తించడానికి ఆపరేషన్ ప్రారంభించారు.

First published:

Tags: Bihar, Snake bite, VIRAL NEWS

ఉత్తమ కథలు